అది మేనిఫెస్టో ప్రకటన... - poll promise is perfectly in order says Sitharaman
close
Published : 25/10/2020 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అది మేనిఫెస్టో ప్రకటన...

దిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో..మేనిఫెస్టోలో ఉచిత కరోనా వైరస్‌ టీకా హామీ ఇచ్చిన భాజపా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. దీనిపై శనివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. ఆమె గురువారం మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా తాము బిహార్‌లో అధికారంలోకి వస్తే 19 లక్షల ఉద్యోగాలు, ఉచితంగా టీకాను అందిస్తామంటూ హామీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. టీకా హామీపై విపక్షాలన్నీ విరుచుకుపడటంతో పాటు, చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరాయి. 

‘అది మేనిఫెస్టో ప్రకటన. ఒక పార్టీ తాను అధికారంలోకి వస్తే ఏ చేయాలనుకుంటుందో వాటి గురించి ప్రకటన చేసుకుంటుంది. మేం చేసింది కూడా అదే. మా ప్రకటన ఒక పద్ధతిలోనే ఉంది. వైద్యం అనేది రాష్ట్రాల పరిధిలోనిది’ అంటూ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.

కాగా, గురువారం ఆమె ప్రకటన అనంతరం.. ప్రజలు టీకా ఎప్పుడు పొందుతారో తెలుసుకోవడానికి రాష్ట్రాల వారీగా ఎన్నికల షెడ్యూల్‌ను పరిశీలించాల్సి ఉంటుందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ‘బిహార్ తప్ప దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నీ పాకిస్థాన్‌’ అంటూ శివసేన తీవ్ర విమర్శలు చేసింది. మహమ్మారి నుంచి కూడా రాజకీయ లబ్ధి  పొందుతున్నారంటూ మండిపడింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని