Oxymeter: వాడే ప‌ద్ధ‌తి ఇదీ: పూజా హెగ్డే  - pooja about oxymeter
close
Published : 14/05/2021 22:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oxymeter: వాడే ప‌ద్ధ‌తి ఇదీ: పూజా హెగ్డే 

ఇంట‌ర్నెట్ డెస్క్: ప్ర‌స్తుతం ఆక్సిమీటర్ ఉప‌యోగం ఎంతో ఉంది. ఆక్సిజ‌న్ స్థాయి తెలుసుకుని అప్ర‌మ‌త్త‌మయ్యేందుకు ఈ ప‌రిక‌రం ప్ర‌తి ఒక్కరి ద‌గ్గ‌రా ఉండాల్సిందే. అయితే దాన్ని ఎలా ప‌డితే అలా వినియోగించ‌కూడ‌దు. ప‌రీక్షించేందుకు ఓ పద్ధ‌తి ఉంది. ఇదే విష‌యాన్ని సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా తెలియ‌జేస్తోంది ప్ర‌ముఖ న‌టి పూజా హెగ్డే. కొవిడ్ బారిన ప‌డిన పూజా ఇటీవ‌ల కోలుకున్న విష‌యం తెలిసిందే. ఆక్సీమీట‌ర్ గురించి ఇలా చెప్పుకొచ్చింది. ‘నేను కొవిడ్ పాజిటివ్‌తో ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు త‌ర‌చూ ఆక్సిజ‌న్ హెచ్చుత‌గ్గుల‌ను ప‌రీక్షించుకోవాల్సి వ‌చ్చింది. వైద్యుడు చెప్పే వ‌ర‌కు ఆక్సీమీట‌ర్‌ని ఎలా ఉప‌యోగించాలో నాకు తెలీదు. ఇప్పుడు దాని గురించి నేను చెప్పేది మీకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నాను. ఈ మ‌హమ్మారిపై చేసే పోరాటంలో ఏ విష‌యాన్నీ తేలిక‌గా తీసుకోవ‌ద్దు’ అని కోరింది.

ఇదీ ప‌ద్ధ‌తి

* ఎలాంటి రంగులు (నెయిల్ పాలిష్‌) లేకుండా గోర్ల‌ను శుభ్రం చేసుకోవాలి.

*  ఆక్సిమీట‌ర్‌ని వాడేముందుకు 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి.

* చూపుడు వేలు, మ‌ధ్య వేలు... వీటిలో ఏదో ఒక దాన్ని ఆక్సిమీట‌ర్‌లో ఉంచాలి.

* య‌థావిధిగా ఆ వేలుని గుండెకి స‌మాంత‌రంగా తీసుకురావాలి.

* మీట‌ర్‌లో రీడింగ్ వ‌చ్చేవ‌ర‌కు అలానే ఉంచాలి.

* వాటిల్లో అత్య‌ధిక రీడింగ్‌ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని