రామ్‌చరణ్‌-పూజా కలిసి మళ్లీ స్టెప్‌ వేస్తే! - pooja hegde acharya cinema shoot with a montage song
close
Published : 04/03/2021 16:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామ్‌చరణ్‌-పూజా కలిసి మళ్లీ స్టెప్‌ వేస్తే!

ఇంటర్నెట్‌ డెస్క్: ‘జిగేల్‌ రాణి’గా ‘రంగస్థలం’లో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది పూజాహెగ్డే. చరణ్‌తో కలిసి ఆమె వేసిన స్టెప్‌లు విపరీతంగా అలరించాయి. మరోసారి వీరిద్దరూ కలిసి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ కథానాయికగా నటిస్తుండగా, రామ్‌చరణ్‌ కామ్రేడ్‌ సిద్ధ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం పూజాహెగ్డే, రామ్‌చరణ్‌లపై ఓ పాటని మారేడుమిల్లిలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో చిత్రీకరిస్తున్నారు.  ఈ పాటకి  ప్రముఖ కొరియాగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ నృత్యాలు సమకూరుస్తున్నారు. మూడు రోజుల పాటు అటవీ నేపథ్యంగా చిత్రీకరించే ఈ పాట కథనంలో చాలా కీలకమైనదని సమాచారం.

గత నెల21న చిత్రీకరణలో పాల్గొన్న నటుడు చిరంజీవి తన షూటింగ్‌ పూర్తి చేసుకొని హైదరాబాద్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో చిరంజీవి సహజ వనరులను కాపాడే నాయకుడిగా, సామాజిక చింతన కలిగిన పాత్రలో కనిపించనున్నారు. రెజీనా ప్రత్యేక గీతంలో కనిపించనుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మాతలు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా, తిరు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. నవీన్‌ నూలి ఎడిటర్‌.  శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని