పూజా హెగ్డే ఉదార‌త‌.. - pooja hegde arranged ration
close
Published : 01/06/2021 17:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పూజా హెగ్డే ఉదార‌త‌..

ముంబయి:  కొవిడ్ సంక్షోభం వ‌ల్ల ఇబ్బంది ప‌డుతోన్న వారికి త‌న‌వంతు సాయం చేశారు ప్ర‌ముఖ నటి పూజా హెగ్డే. లాక్‌డౌన్ కార‌ణంగా స‌మస్య‌లు ఎదుర్కొంటున్న పేద కుటుంబాల‌కి అండ‌గా నిలిచారు. 100 కుటుంబాల‌కు నెల‌కు స‌రిప‌డా స‌రుకుల్ని అందించి, త‌న ఉదార‌త‌ని చాటుకున్నారు. వాట‌న్నింటిని త‌నే స్వ‌యంగా ప్యాక్ చేశారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజ‌న్లు, పూజా అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. క‌రోనా బారిన ప‌డిన పూజా ఇటీవ‌ల కోలుకున్న సంగ‌తి తెలిసిందే. కొవిడ్ పాజిటివ్ వ‌చ్చినంత మాత్రాన భ‌య‌ప‌డ‌కూడ‌ద‌ని, ఆక్సీమీట‌ర్ ఎలా ప‌డితే అలా వాడ‌కూడ‌ద‌ని ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వీడియోలు రూపొందించి ధైర్యాన్నిస్తున్నారు. ప్ర‌భాస్ స‌ర‌స‌న ‘రాధేశ్యామ్’, రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ‘ఆచార్య‌’లో న‌టిస్తోంది పూజా. అఖిల్‌తో క‌లిసి న‌టించిన  ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. 

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని