‘రాధేశ్యామ్‌’లో పూజా హెగ్డే ఇలా..! - pooja hegde as a Prerana from RadheShyam
close
Updated : 13/10/2020 14:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రాధేశ్యామ్‌’లో పూజా హెగ్డే ఇలా..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. పూజా హెగ్డే కథానాయిక. మంగళవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా పూజా లుక్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఇందులో పూజా డ్రెస్సింగ్‌ స్టైల్‌ కూడా అలాగే ఉంది. రైలులో ప్రయాణిస్తూ చిరు నవ్వులు చిందిస్తున్న పూజా ఫొటో అభిమానులను అలరిస్తోంది. ఇందులో పూజా ‘ప్రేరణ’ అనే పాత్రలో నటిస్తోంది. మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు వచ్చింది. ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా అతి తక్కువమంది బృందంతో చిత్రీకరణ జరుపుతున్నట్లు సమాచారం.

‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ నుంచీ కానుక!

అఖిల్‌ కథానాయకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. పూజా హెగ్డేకు జన్మదినం శుభాకాంక్షలు చెబుతూ, ఈ చిత్ర బృందం కూడా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని