‘రాధేశ్యామ్’‌ కోసం పూజా డబ్బింగ్‌! - pooja hegde dubbing for radheshyam!
close
Published : 13/02/2021 20:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రాధేశ్యామ్’‌ కోసం పూజా డబ్బింగ్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఇందులో కథానాయికగా పూజాహెగ్డే నటిస్తోంది. ఆమె తన పాత్రకు తెలుగు, హిందీ భాషల్లో డబ్బింగ్‌ చెప్పుకోనుంది. ఈ సినిమా షూటింగ్‌ ముగియగానే, వేసవిలో డబ్బింగ్ పనిని ప్రారంభించనుందని సమాచారం. చిత్ర టీజర్‌ని ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇందులో పూజ పాత్ర పేరు ప్రేరణ. 1970ల నాటి ప్రేమకథా నేపథ్యంలో ఉండనుందని ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది. ఈ ఏడాది జులైలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ప్రస్తుతం ఆమె చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య’ చిత్రంలో రామ్‌చరణ్ సరసన, అఖిల్‌ అక్కినేనితో ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లోనూ చేస్తోంది.

ఇవీ చదవండి..!

శంకర్‌-చరణ్‌ మూవీ: ఆసక్తికర విషయాలివే!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని