హైదరాబాద్‌ టు ముంబయి..! - pooja hegde gets a special gift from ala vaikuntapuramloo team
close
Published : 18/03/2021 13:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌ టు ముంబయి..!

‘బుట్టబొమ్మ’ నుంచి పూజాకు స్పెషల్‌ గిఫ్ట్‌

హైదరాబాద్‌: తాము నటించిన చిత్రానికి సంబంధించి కాస్ట్యూమ్స్‌, ఏ ఇతర ప్రొడెక్షన్‌ సామాగ్రి నచ్చినా చిత్రబృందాన్ని కోరి అగ్ర నటీనటులు వాటిని తమ నివాసానికి తీసుకువెళ్తారు. లేదా, చిత్రబృందమే వారికి బహుమతిగా ఆ వస్తువులను అందిస్తుంది. అదే మాదిరిగా బుట్టబొమ్మ పూజాహెగ్డేకి కూడా ‘అల.. వైకుంఠపురములో..’ టీమ్‌ నుంచి ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ లభించింది. ఆమె కోసం షూట్‌లో వాడిన ఓ సైకిల్‌ని హైదరాబాద్‌ నుంచి ముంబయికి పంపించిందట‌. ఈ విషయాన్ని ఇటీవల పూజాహెగ్డే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

‘‘బుట్టబొమ్మ’ పాటలోని సైకిల్‌కి నేను ఫిదా అయిపోయాను. అది నాకెంతో నచ్చింది. మొదటిసారి షూట్‌లో దాన్ని చూడగానే.. చక్కగా అలంకరించారు అనిపించింది. సైకిల్‌పై నేను మనసుపారేసుకున్నానని తెలుసుకున్న నిర్మాణబృందం నాకోసం ప్రత్యేకంగా దానిని హైదరాబాద్‌ నుంచి ముంబయికి పంపించారు. ప్రస్తుతం ఆ సైకిల్‌ని మా నివాసంలో భద్రంగా దాచాను. ఆ సినిమా నుంచి నాకు లభించిన మధురమైన జ్ఞాపకమది’ అని పూజాహెగ్డే తెలిపారు. పూజాహెగ్డే సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె ‘ఆచార్య’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, ‘సర్కస్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. దీనితోపాటు విజయ్‌ 65వ చిత్రంలోనూ పూజా భాగమైనట్లు కోలీవుడ్‌ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని