కోలుకుంటున్న వేళ - pooja hegde shares new pic
close
Published : 02/05/2021 12:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోలుకుంటున్న వేళ

కరోనాను ఎదుర్కోవాలంటే ముందు మానసికంగా ధైర్యంగా ఉండాలి. నవ్వుతూనే అది విసిరే సవాల్‌ స్వీకరించాలి. అప్పుడే కరోనాపై విజయం. పూజా హెగ్డే ఆ దిశగానే అడుగులు వేస్తుంది. కొన్ని రోజుల క్రితమే ఆమెకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

తాజాగా ఆమె ఓ ఫొటోను పంచుకున్నారు. అందులో ఉదయం వేళ ఆనందంగా కేకు కోస్తుంది పూజ.  ‘రికవరింగ్‌ మార్నింగ్స్‌’అని ఆ ఫొటోకి వ్యాఖ్య రాసింది పూజ. దీనికి నెటిజన్లు, ఆమె అభిమానులు సంతోష పడుతున్నారు. పూజ త్వరగా కోలుకుంటున్నందుకు ఖుషీ అయిపోతున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సెట్లోకి అడుగుపెడుతున్నా చాలామందిని కరోనా వదలడం లేదు. కానీ చాలామంది తారలు ధైర్యంగా కరోనాని జయించి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని