మహష్‌ బాబుతో నటించనున్న పూజా హెగ్డే! - pooja hegde with mahesh babu next movie ssmb28
close
Published : 07/04/2021 23:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహష్‌ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!

ఇంటర్నెట్‌ డెస్క్: మిల్కీస్టార్‌ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కలిసి ఓ సినిమా చేయనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో పాటు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాయికగా పూజాహెగ్డేని తీసుకోనున్నారని సమాచారం. ఇప్పటికే పూజాతో చిత్రబృందం చర్చలు కూడా జరిపిందట. స్క్రిప్టు  విన్న పూజా సానూకూలంగా స్పందించిందట. త్వరలోనే మహేష్‌తో కలిసి పనిచేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28’ వర్కింగ్ టైటిల్‌గా రూపొందనున్న ఈ సినిమాని హారిక అండ్‌ హాసిని సంస్థలు, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్ సహకారంతో నిర్మించనున్నారు. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే విడుదల చేయనున్నారు. గతంలో త్రివిక్రమ్‌ - మహేష్‌ బాబు కాంబినేషన్లో ‘అతడు’, ‘ఖలేజా’ వంటి చిత్రాలు వచ్చాయి.  ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాగా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28’ తెరకెక్కనుంది. పూజాహెగ్డే - మహేష్‌బాబుతో కలిసి ‘మహర్షి’ చిత్రంలో నటించి అభిమానుల్ని అలరించింది. ప్రస్తుతం మహేష్‌బాబు - పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’తో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే - ప్రభాస్‌తో కలిసి ‘రాధేశ్యామ్‌’, చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న ‘ఆచార్య’లోనూ చేస్తోంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని