Raj kundra: రాజ్‌ కుంద్రా బెయిల్‌ పిటిషన్‌ విచారణ ఎప్పుడంటే?   - pornography case mumbai court to hear bail pleas of raj kundra ryan thorpe on aug 10
close
Updated : 06/08/2021 04:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Raj kundra: రాజ్‌ కుంద్రా బెయిల్‌ పిటిషన్‌ విచారణ ఎప్పుడంటే?  

ఇంటర్నెట్‌ డెస్క్‌: అశ్లీల వీడియోల నిర్మాణం, ప్రసారం కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రా, అతని సహచరుడు రయాన్‌ థోర్ప్‌ బెయిల్‌ పిటిషన్లపై ఆగస్టు 10న వాదనలు వింటామని ముంబయి సెషన్స్‌ కోర్టు గురువారం తెలిపింది. బెయిల్‌ విషయంలో మీ స్పందన తెలపాలంటూ ముంబయి పోలీసులను ఆదేశించింది. ‘నిందితుల విడుదల దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తుంది.. పైగా వారు చేసింది సమాజానికి హానికరమైన పని’గా పేర్కొంటూ.. మెజిస్ట్రేట్ కోర్టు వారి బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ వారు సెషన్స్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అశ్లీల చిత్రాల వ్యవహారం కేసులో తమను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ వారిద్దరు దాఖలు చేసిన పిటిషన్లపై బాంబే హైకోర్టు ఆగస్టు 2న తన తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని