భారత్‌-పాక్‌ నిర్ణయాన్ని ప్రశంసించిన ఐరాస - positive step towards greater peace us and un welcome india pakistan decision to ceasefire along loc
close
Published : 26/02/2021 23:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌-పాక్‌ నిర్ణయాన్ని ప్రశంసించిన ఐరాస

ఇంటర్నెట్ డెస్క్‌: సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటించేందుకు భారత్‌-పాక్‌ మధ్య కుదిరిన అంగీకారాన్ని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని ఐరాస అధినాయకత్వం స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. కాల్పుల విరమణపై భారత్‌, పాక్‌ సైన్యం చేసిన సంయుక్త ప్రకటన కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంత వాతావరణానికి దోహదం చేస్తుందని ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డొజారిక్‌ తెలిపారు. ఇరు దేశాల తదుపరి చర్చలకు ఇదొక సానుకూల పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత్‌-పాక్‌ మధ్య కుదిరిన అంగీకారాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి 75వ సెషన్‌ అధ్యక్షుడు వొల్కాన్‌ బోజ్కిర్‌ వెల్లడించారు. ప్రధాన సమస్యలు, ఆందోళనలను పరిష్కరించడం ద్వారా సుస్థిర శాంతిని సాధించవచ్చని చెప్పేందుకు ఇది ఉదాహరణగా నిలుస్తుందని ట్విటర్‌లో పేర్కొన్నారు. గురువారం భారత్‌, పాక్‌ డైరెక్టర్‌ జనరళ్ల స్థాయి సమావేశంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తప్పనిసరిగా పాటించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని