సాబ్‌ రీఎంట్రీ.. రెస్పాన్స్‌ మామూలుగా లేదుగా - power packed response to vakeel saab teaser
close
Published : 16/01/2021 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాబ్‌ రీఎంట్రీ.. రెస్పాన్స్‌ మామూలుగా లేదుగా

ట్రెండింగ్‌లో దూసుకెళ్తోన్న పవర్‌ప్యాక్డ్‌ టీజర్‌

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌.. వెండితెరపై ఈ పేరును చూడాలని దాదాపు మూడేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆశకు జీవం పోస్తూ విడుదలైన ‘వకీల్‌సాబ్‌’ టీజర్‌కు భారీ స్పందన లభిస్తోంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ న్యాయవాదిగా కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వకీల్‌సాబ్‌’ టీజర్‌కు నెటిజన్లతోపాటు, సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. టీజర్‌.. పవర్‌ప్యాక్డ్‌గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ టీజర్‌ ఇప్పటివరకూ ఏడు మిలియన్ల వ్యూస్‌తో 7.15 లక్షల లైక్స్‌తో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నంబర్‌ 1గా దూసుకెళ్తోంది.

‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ పవన్‌ చెప్పే పంచ్‌ డైలాగ్‌తోపాటు ఆయన లుక్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌.. ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తున్నాయి. మరోవైపు నటుడు నాగబాబు, నిహారిక, వెన్నెల కిషోర్‌, రామ్‌చరణ్‌, హరీశ్‌ శంకర్‌, క్రిష్‌, తమన్‌, సాయిధరమ్‌ తేజ్‌, శ్రీకాంత్‌, బాబి, వరుణ్‌ తేజ్‌ తదితరులు... ‘పవర్‌స్టార్‌ స్టైల్‌ను ఎవరూ మ్యాచ్‌ చేయలేరు. విజువల్‌ ట్రీట్‌ అదుర్స్. ఆయన రీఎంట్రీ సూపర్బ్‌గా ఉంది.‌’ అని పేర్కొంటూ వరుస ట్వీట్లు చేశారు. ‘వకీల్‌సాబ్‌’ పక్కా సూపర్‌హిట్‌ చిత్రమంటూ పలువురు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇదీ చదవండి

పవన్‌ ‘వకీల్‌సాబ్‌’ టీజర్‌ అదుర్స్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని