ఒక్క డైలాగ్‌ లేకుండా ‘పవర్‌ప్లే’ ట్రైలర్‌!   - power play trailer
close
Published : 04/02/2021 15:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్క డైలాగ్‌ లేకుండా ‘పవర్‌ప్లే’ ట్రైలర్‌! 

హైదరాబాద్‌: యువనటుడు రాజ్‌తరుణ్‌ హీరోగా, విజయకుమార్‌ కొండా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘పవర్‌ ప్లే’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలయ్యింది. ఒక్క‌ డైలాగ్‌ కూడా లేకుండా వచ్చిన ఈ ట్రైలర్‌ ఆసక్తి రేపుతోంది. మధునందన్‌, అజయ్‌, రాజారవీంద్ర, పూర్ణ వంటి ప్రముఖ నటులు ఇందులో నటిస్తున్నారు. చూస్తుంటే ఇదేదో సస్పెన్స్‌ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. సురేష్‌ బొబ్బిలి అందించిన బ్యాక్‌గ్రౌండ్ ‌స్కోర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రాన్ని మనమాలి క్రియేషన్స్‌పై మహిథర్‌, దేవేష్‌ నిర్మిస్తున్నారు. హేమల్‌ కథానాయికగా నటిస్తోంది. విజయ్‌కుమార్‌ కొండా, రాజ్‌తరుణ్ కాంబినేషన్లో గతంలో ‘ఒరేయ్‌ బుజ్జిగా’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ‘పవర్‌ ప్లే’ ట్రైలర్‌ను మీరు చూసేయండి!

ఇవీ చదవండి!

‘సైనైడ్‌’లో అంతర్జాతీయ నటి తనిష్టా

బీటౌన్‌పై దృష్టి పెట్టిన టాలీవుడ్‌ హీరో..!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని