పవన్‌ డెడికేషన్‌కు నిదర్శనం ఈ ఫొటోలు - powerstar dedication levels
close
Published : 02/04/2021 15:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ డెడికేషన్‌కు నిదర్శనం ఈ ఫొటోలు

‘హరిహర వీరమల్లు’ కోసం సిద్ధమవుతోన్న పవర్‌స్టార్‌

హైదరాబాద్‌: అటు రాజకీయాలు ఇటు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంటున్నారు అగ్రకథానాయకుడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌. పార్టీపరమైన మీటింగ్స్‌లో పాల్గొంటున్నప్పటికీ సమయం తీసుకుని మరీ తదుపరి చిత్రాల కోసం ఆయన సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బయటకు వచ్చిన కొన్ని ఫొటోలు వృత్తిపట్ల ఆయనకున్న అంకితభావానికి అద్దం పట్టేలా ఉన్నాయి. ఉదయం ఏడు గంటలకే ‘హరిహర వీరమల్లు’ సెట్స్‌కు చేరుకున్న పవన్‌కల్యాణ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ సారథ్యంలో స్టంట్స్‌ ప్రాక్టీస్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది.

‘‘వృత్తిపట్ల పవన్‌కల్యాణ్‌కి ఉన్న అంకితభావమిది‌. ఉదయం ఏడు గంటల సమయంలో సూపర్‌ యాక్షన్‌ సీక్వెన్స్ చిత్రీకరణకు ముందు ‘మాస్టర్‌’ యాక్షన్‌ డైరెక్టర్‌ శామ్‌కౌశల్‌తో కలిసి పోరాట సన్నివేశాలకు సిద్ధమవుతోన్న పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌’’ అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది.

చారిత్రాత్మక కథాంశంతో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’కు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్‌ వజ్రాల దొంగగా కనిపించనున్నట్లు సమాచారం. నిధి అగర్వాల్‌ కథానాయిక. బాలీవుడ్‌ భామ జాక్వెలిన్‌ ఈ సినిమాలో మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు కుమార్తెగా కనిపించే అవకాశాలున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. ఏఎం రత్నం నిర్మాత. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని