పవన్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ - powerstar pawan kalyan vakeel saab teaser on jan 14
close
Published : 07/01/2021 19:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పవన్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారందరికీ సంక్రాంతి కానుక ఇవ్వనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ముగ్గుల పండగకు ‘వకీల్‌ సాబ్‌’ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

‘మీరెంతగానో ఎదురు చూస్తున్న వకీల్‌సాబ్‌ టీజర్‌ను జనవరి 14వ తేదీ సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేస్తాం’ -ట్విటర్‌లో చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌

ఇందులో పవన్‌కు జోడీగా శ్రుతిహాసన్‌ కనిపించనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘గబ్బర్‌ సింగ్‌’, ‘కాటమరాయుడు’ చిత్రాలు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి ఈ జోడీ అలరించేందుకు సిద్ధమవుతోంది. హిందీ సూపర్‌హిట్‌ ‘పింక్‌’ రీమేక్‌గా ‘వకీల్‌సాబ్‌’ తెరకెక్కుతోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని