‘హరిహర వీరమల్లు’గా పవర్‌స్టార్‌..! - powerstar pspk27 movie titled confirmed as hari hara veera mallu
close
Published : 02/02/2021 17:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘హరిహర వీరమల్లు’గా పవర్‌స్టార్‌..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ సినిమా ప్రకటిస్తే చాలు ఆ సినిమా గురించి రకరకాల ఊహాగానాలు.. చర్చలు సాగుతుంటాయి. రాజకీయాల కారణంగా చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ‘వకీల్‌సాబ్‌’తో రీఎంట్రీ ఇస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయి ఏప్రిల్‌ 9న విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం పవన్‌-రానా ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. మలయాళీ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’కు రీమేక్‌ అది. ఈ చిత్రానికి సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ తన 27వ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అయితే.. ఆ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్‌, పవర్‌ఫుల్‌ టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘హరిహర వీరమల్లు’ పేరుతో ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి.

పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కనున్న #PSPK27లో పవన్‌ డైమండ్ల దొంగగా కనిపించనున్నారట. ఈ సినిమా టైటిళ్లపై కొంతకాలంగా చర్చ సాగుతూ వస్తోంది.. ‘విరూపాక్ష’, ‘బందిపోటు’, ‘గజదొంగ’, ‘ఓం శివమ్‌’ ఇలా చాలా పేర్లు వినిపించాయి. కాగా.. ఆఖరికి ‘హరిహర వీరమల్లు’ పేరును ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. టైటిల్‌ విషయంలో చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్‌ నటించనుంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

ఇవీ చదవండి..

విశ్వక్‌సేన్‌ ‘పాగల్‌’ విడుదల తేదీ ఖరారు

ఒకే రోజు అటు థియేటర్‌లో.. ఇటు ఓటీటీలో?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని