స్టార్‌హీరోతో ప్రభాస్‌ మల్టీస్టారర్‌..? - prabhas and hrithik for a multi starrer
close
Published : 11/03/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టార్‌హీరోతో ప్రభాస్‌ మల్టీస్టారర్‌..?

కథ మామూలుగా ఉండదు అంటోన్న నెటిజన్లు

హైదరాబాద్‌: సినిమాల విషయంలో ప్రభాస్‌ జోరు పెంచారు. ఒకదాని తర్వాత మరొకటి వరుస భారీ ప్రాజెక్ట్‌లను ఆయన ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం ‘సలార్‌’ షూట్‌లో బిజీగా ఉన్న ఆయన అతి త్వరలో ‘ఆదిపురుష్‌’ను పట్టాలెక్కించనున్నారు. మరోవైపు ఈ ఏడాదిలోనే నాగ్‌అశ్విన్‌ సినిమా షూట్‌ కూడా ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ప్రభాస్‌తో కలిసి పనిచేసేందుకు అగ్ర దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. డార్లింగ్‌తో సినిమా చేసేందుకు బాలీవుడ్‌లో పేరుపొందిన ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్‌తో ఓ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. హృతిక్‌-ప్రభాస్‌ మల్టీస్టారర్‌గా ఇది రానుందంటూ ప్రచారం సాగుతోంది. బీటౌన్‌లో యాక్షన్‌ చిత్రాలకు పేరుపొందిన సిద్దార్థ్‌ ఆనంద్‌ ఈ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే దర్శక-నిర్మాతలు ప్రభాస్‌ని కలిసినట్లు.. ఆయన కూడా ఇందులో నటించేందుకు ఓకే చెప్పినట్లు బీటౌన్‌లో వినికిడి. దీంతో ప్రభాస్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కథ కూడా అదే లెవల్‌లో ఉండనుందంటూ చెప్పుకుంటున్నారు. అయితే, ప్రభాస్‌-హృతిక్‌ మల్టీస్టారర్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు, హృతిక్‌-టైగర్‌ష్రాఫ్‌తో ‘వార్‌’ని చిత్రీకరించి సిద్దార్థ్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం విధితమే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని