ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు అశ్విన్‌ సర్‌ప్రైజ్‌ - prabhas and nag aswin movie update on jan or feb ending
close
Updated : 23/01/2021 14:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు అశ్విన్‌ సర్‌ప్రైజ్‌

ఈసారి డేట్స్‌తో సహా చెప్పేశారు

హైదరాబాద్‌: పాన్‌ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. త్వరలో ప్రభాస్‌ హీరోగా తాను తెరకెక్కించనున్న చిత్రానికి సంబంధించి రెండు అప్‌డేట్‌లను ఇస్తానని డేట్స్‌తో సహా ప్రకటించారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై నాగ్‌అశ్విన్‌-ప్రభాస్‌ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ రానున్నట్లు గతేడాది చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె కథానాయికగా నటించనున్నారు. అలాగే బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.

కాగా, సంక్రాంతి పండుగ తర్వాత తమ చిత్రానికి సంబంధించి ఓ ప్రత్యేకమైన అప్‌డేట్‌ ఇస్తానని దర్శకుడు నాగ్‌అశ్విన్‌ ఈ ఏడాది ఆరంభంలో చెప్పారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ జరిగి పదిరోజులు కావొస్తున్నా ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకపోవడంతో నెటిజన్లు ట్విటర్‌ వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీంతో స్పందించిన నాగ్‌ అశ్విన్‌.. ‘జనవరి 29న ఒకటి, ఫిబ్రవరి 26న మరొకటి.. కచ్చితంగా అప్‌డేట్‌లు ఉంటాయి’ అని సమాధానమిచ్చారు. మరోవైపు ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌’లో నటిస్తున్నారు. దీనితోపాటు ఆయన.. ప్రశాంత్‌నీల్‌తో ‘సలార్‌’ చేయనున్నారు.

ఇదీ చదవండి

ప్రభాస్‌.. ఇదస్సలు ఊహించలేదు: కృష్ణంరాజు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని