PoojaHegde: పూజాహెగ్డేతో ప్రభాస్‌ మాట్లాడడం లేదా? - prabhas and pooja hegde not on good terms radha shyam makers respond to rumours
close
Updated : 23/09/2021 07:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PoojaHegde: పూజాహెగ్డేతో ప్రభాస్‌ మాట్లాడడం లేదా?

నిర్మాణ సంస్థ ఏమందంటే..!

హైదరాబాద్‌: పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌, బుట్టబొమ్మ పూజాహెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అపురూప ప్రేమకావ్యం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల్ని అలరించనుంది. ఈ మేరకు చిత్రబృందం నిర్మాణ, నిర్మాణాంతర పనుల్లో ఫుల్‌ బిజీగా పాల్గొంటుంది. కాగా, తాజా సమాచారం ప్రకారం ప్రభాస్‌-పూజాహెగ్డే సరిగ్గా మాట్లాడుకోవడం లేదని నెట్టింట్లో తెగ టాక్‌ నడుస్తోంది. పూజా ప్రవర్తన నచ్చకపోవడం వల్లే ప్రభాస్‌ ఆమెకు దూరంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సదరు వార్తలపై తాజాగా ‘రాధేశ్యామ్‌’ టీమ్‌ స్పందించింది. అవన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పింది. వాళ్లిద్దరూ చక్కగా మాట్లాడుకుంటున్నారని.. ఒకరిపై మరొకరికి అభిమానం ఉందని టీమ్‌ చెప్పింది. ఆఫ్‌స్క్రీన్‌లో వాళ్లిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉందని.. ఆ బంధమే ఆన్‌స్క్రీన్‌లోనూ కొనసాగిందని వివరించింది. పూజా చక్కని సమయపాలన పాటిస్తుందని.. చెప్పిన సమయానికి సెట్‌లో ఉంటుందని.. ఆమె మంచి నటి అని టీమ్‌ వివరించింది. మరోవైపు వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో మైనే ప్యార్‌ కియా ఫేమ్‌ భాగ్యశ్రీ కీలకపాత్రలో కనిపించనున్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని