ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేయనున్న ప్రభాస్‌..! - prabhas has decided to buy a costly apartment in mumbai
close
Published : 03/03/2021 13:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేయనున్న ప్రభాస్‌..!

ఇంటి ఎంపికలో హీరో టీమ్‌ బిజీ

హైదరాబాద్‌: వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీ షెడ్యూల్‌ గడుపుతున్నారు పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌. ప్రస్తుతం ‘సలార్‌’తో బిజీగా ఉన్న ఆయన త్వరలో మరో పాన్‌ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’ షూట్‌లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ‘ఆదిపురుష్‌’ చిత్రీకరణ ప్రారంభమైన నాటి నుంచి పూర్తయ్యే వరకూ ప్రభాస్‌ ఎక్కువ శాతం ముంబయిలోనే గడపనున్నారు. అక్కడ ఉన్నన్ని రోజులు హోటల్‌లో కాకుండా ఫ్లాట్‌లో ఉండాలని ప్రభాస్‌ భావిస్తున్నారట‌. దీంతో తన అభిరుచులకు తగ్గట్టుగా ముంబయిలోని ఖరీదైన ప్రాంతంలో ఓ విలాసవంతమైన ఫ్లాట్‌ కొనుగోలు చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారట. ఈ మేరకు ఆయన బృందం ఇల్లు ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు బాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్‌, రష్మిక సైతం ముంబయికి మకాం మార్చినట్లు ఇటీవల నెట్టింట్లో పోస్టులు దర్శనమిచ్చాయి.

ఇక ‘ఆదిపురుష్‌’ విషయానికి వస్తే.. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఓంరౌత్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనున్నారు. సీతగా కృతిసనన్‌ సందడి చేయనున్నట్లు సమాచారం. ఇక రామాయణంలో ముఖ్యమైన రావణుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటించనున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ‘ఆదిపురుష్‌’ రోజువారీ‌ షూట్‌ మరికొన్ని నెలల్లో ప్రారంభం కానుండడంతో వీఎఫ్‌ఎక్స్‌, స్టైలింగ్‌, కాస్ట్యూమ్స్‌ పనుల్లో ప్రస్తుతం చిత్రబృందం పూర్తిగా నిమగ్నమైంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని