‘ఆదిపురుష్‌’ ఆరంభం అంటున్న ప్రభాస్‌! - prabhas says adhipurush arambh
close
Published : 02/02/2021 11:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆదిపురుష్‌’ ఆరంభం అంటున్న ప్రభాస్‌!

హైదరాబాద్‌: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా 3డీ చిత్రం ‘ఆదిపురుష్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ప్రభాస్‌ ఈ సినిమాకు సంబంధించి చేసిన ట్వీట్‌ అభిమానులను ఖుషీ చేస్తోంది. దానికి ‘ఆదిపురుష్‌ ఆరంభ్‌’ పేరిట హ్యాష్‌ట్యాగ్‌ ఇచ్చారు. రామాయాణం కథాంశంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శ్రీరాముని పాత్రలో ప్రభాస్‌, రావణుని పాత్రలో సైఫ్‌అలీఖాన్ నటిస్తుండటం విశేషం. మొత్తం ఐదు భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే వీఎఫ్‌ఎక్స్‌ పనులను ప్రారంభించారు. టి-సిరీస్‌, రెట్రో పిల్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరోవైపు ప్రభాస్‌ ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్‌ ప్రభాస్‌ సరసన నటిస్తున్నారు. ఇటీవలే గోదావరి ఖని ఓపెన్‌కాస్ట్‌లో షూటింగ్‌ కూడా మొదలపెట్టారు. ఆ షూట్‌లో లీకైన కొన్ని ప్రభాస్‌ ఫొటోలు అంతర్జాలంలో వైరల్‌గా మారాయి.

ఇవీ చదవండి!

నా కల తీర్చింది ‘జాంబీరెడ్డి’

పాటలాగే శశి విజయం సాధిస్తుంది
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని