ప్రభాస్‌ షెడ్యూల్‌ మారిందా? - prabhas schedule change due to fire accident in adipurush sets
close
Published : 12/02/2021 08:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ షెడ్యూల్‌ మారిందా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న నటుల్లో స్టార్‌ హీరో ప్రభాస్‌ ఒకరు. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. మరోవైపు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’ మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఇది సెట్స్‌పై ఉండగానే ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న ‘ఆది పురుష్‌’లో ప్రభాస్‌ నటిస్తున్నారు. అయితే, ఇటీవల ఆ చిత్ర సెట్స్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో సినిమా చిత్రీకరణ మరింత ఆలస్యం కానుంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ‘ఆది పురుష్‌’ కోసం చిత్ర బృందం అత్యున్నత సాంకేతిక టెక్నాలజీని వాడుతోంది. సన్నివేశాలు అత్యంత సహజ సిద్ధంగా వచ్చేందుకు మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. సెట్స్‌లో అగ్నిప్రమాదం జరగడంతో ముఖ్యమైన పరికరాలు దెబ్బతిన్నాయని సమాచారం. వీటిలో కొన్ని విదేశాల నుంచి రావాల్సి ఉంది. దీంతో ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం కానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ షెడ్యూల్‌ మారినట్టు సమాచారం. ‘ఆది పురుష్‌’ కోసం కేటాయించిన డేట్లు ‘సలార్‌’, నాగ్‌ అశ్విన్‌ చిత్రానికి సర్దుబాటు చేయనున్నారట. దీంతో ఈ రెండు సినిమాలు మరో అడుగు ముందు వేస్తాయని చిత్ర వర్గాలు అంటున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని