ప్రభాస్‌ స్పెషల్‌ గిఫ్ట్స్‌ చూశారా..! - prabhas sends watches to radheshyam team
close
Published : 18/01/2021 19:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ స్పెషల్‌ గిఫ్ట్స్‌ చూశారా..!

సంక్రాంతి కానుక.. అభిమానులు ఫిదా

హైదరాబాద్‌: యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తరచూ తన మంచి మనసును చాటుకుంటారు. తన కోసం ఎన్నో విధాలుగా శ్రమిస్తున్న తన టీమ్‌కు పలు సందర్భాల్లో ప్రత్యేకంగా బహుమతులు అందించి వారి ప్రేమాభిమానులను పొందుతుంటారు ఈ హీరో. ఈ క్రమంలోనే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా ప్రభాస్‌ ‘రాధేశ్యా్‌మ్‌’ టీమ్‌కు స్పెషల్‌ గిఫ్ట్స్‌ అందించారు. కె.రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పనిచేస్తున్న ప్రతిఒక్కరికీ టైటాన్‌ చేతి గడియారాలను బహుమతిగా అందించారు. ఊహించనివిధంగా తమ హీరో నుంచి విలువైన బహుమతి లభించడంతో చిత్రబృందంలోని సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా తమ బహుమతుల గురించి పలువురితో పంచుకున్నారు. నెట్టింటి వేదికగా ప్రభాస్‌ అందించిన కానుకల గురించి తెలుసుకున్న  అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. తమ హీరో చేసిన పనికి ఫిదా అయ్యామంటూ పోస్టులు పెడుతున్నారు.

వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్‌’లో ప్రభాస్‌కు జంటగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్యగా.. పూజాహెగ్డే ప్రేరణగా కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్‌, ప్రసిద్ధ ఉప్పలపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలనాటి నటి భాగ్యశ్రీ కీలకపాత్రలో కనిపించనున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా హైదరాబాద్‌ షెడ్యూల్‌ ఇటీవల పూర్తైనట్లు సమాచారం.

ఇదీ చదవండి
సలార్‌ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని