లాక్‌డౌన్ స‌మ‌యంలో నేర్చుకున్న‌ద‌దే: ప్ర‌భుదేవా - prabhudeva about lockdown
close
Published : 25/05/2021 00:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్ స‌మ‌యంలో నేర్చుకున్న‌ద‌దే: ప్ర‌భుదేవా

ఇంట‌ర్నెట్ డెస్క్: డ్యాన్స‌ర్‌గా, న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్ర‌భుదేవా. స‌ల్మాన్ ఖాన్ హీరోగా ఆయ‌న తెర‌కెక్కించిన రాధే చిత్రం ఇటీవ‌ల విడుద‌లై ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ లాక్‌డౌన్ స‌మయాన్ని ఎలా గ‌డిపారో తెలిపారు. ‘ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌శాంతంగా ఉండ‌టం, చిన్న చిన్న వాటిని ఆస్వాదించడం ఎలాగో నేర్చుకున్నాను. రెస్టారంట్లు, మల్టీప్లెక్సులు అన్నీ మూతబ‌డ్డాయి. స్నేహితుల్నీ క‌ల‌వ‌లేని పరిస్థితి ఏర్ప‌డింది. కొన్ని వారాల క్రితం క్రికెట్ మ్యాచ్‌లు జ‌రిగాయి. మ‌న‌మంద‌రం వాటిని డిజిట‌ల్ మాధ్య‌మం వేదిక‌గా చూశాం. సినిమాలూ అంతే. ఇంట్లోనే సుర‌క్షితంగా ఉంటూ వినోదాన్ని పొందాలంటే ఓటీటీలే వేదిక‌గా నిలుస్తున్నాయి. నేనూ లాక్‌డౌన్‌లో చాలా సినిమాలు చూశాను. అన్ని ఓటీటీల్లో అందుబాటులో ఉన్న కామెడీ, ప్రేమ‌, యాక్ష‌న్‌, థ్రిల్ల‌ర్‌.. ఇలా అన్ని త‌ర‌హా చిత్రాలు చూసేశాను’ అని చెప్పుకొచ్చారు. ఆయ‌న న‌టించిన కొన్ని త‌మిళ చిత్రాలు విడుద‌లకు సిద్ధంగా ఉన్నాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని