సోనూసూద్‌కు ప్రకాశ్‌ రాజ్‌ సర్‌ప్రైజ్‌ - prakash raj felicitated sonu sood
close
Updated : 28/09/2020 17:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోనూసూద్‌కు ప్రకాశ్‌ రాజ్‌ సర్‌ప్రైజ్‌

హైదరాబాద్‌: కరోనా సమయంలో దాతృత్వం చాటుకుని ‘రియల్‌ హీరో’ అనిపించుకున్న నటుడు సోనూసూద్‌. లాక్‌డౌన్‌ నుంచి పేదలకు  సాయం చేస్తూనే ఉన్నారు. వలస కార్మికుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు.  సోషల్‌మీడియా వేదికగా అవసరాల్లో ఉన్న వారిని గుర్తించి.. ఆసరాగా నిలిచారు. అంతేకాదు  తన తల్లి స్వర్గీయ సరోజ్‌ సూద్‌ పేరుతో పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆయన్ను ఆరాధిస్తున్నారు. కరోనా వల్ల ఇన్నాళ్లూ షూటింగ్‌లకు దూరంగా ఉన్న ఆయన తిరిగి చిత్రీకరణలో పాల్గొన్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘అల్లుడు అదుర్స్‌’. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకుడు. నభా నటేష్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, సోనూ సూద్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం సోమవారం సోనూ ముంబయి నుంచి హైదరాబాద్‌ వచ్చారు. ఆయన సెట్‌లోకి అడుగుపెట్టగానే ప్రకాశ్‌రాజ్‌ ఘన స్వాగతం పలికారు. కరోనా కష్టకాలంలో నలుగురికి ఆపన్న హస్తం అందించినందుకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోల్ని చిత్ర బృందం పంచుకుంది. ప్రకాశ్‌రాజ్‌ ఇలా ప్రోత్సహించడం పట్ల నటుడు బ్రహ్మాజీ ఆనందం వ్యక్తం చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని