‘కేజీఎఫ్‌ 2’లో ప్రకాశ్‌ రాజ్‌ పాత్ర అదేనా? - prakashraaj joins the shoot of KGF Chapter Two
close
Updated : 26/08/2020 19:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కేజీఎఫ్‌ 2’లో ప్రకాశ్‌ రాజ్‌ పాత్ర అదేనా?

హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కేజీఎఫ్‌ 2’ ఒకటి. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌: చాప్టర్‌1’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌: చాప్టర్‌2’ను తెరకెక్కిస్తున్నారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. తాజాగా షూటింగ్‌లకు అనుమతులు రావడంతో బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్‌లో ‘కేజీఎఫ్‌: చాప్టర్‌2’ చిత్రీకరణను ప్రారంభించారు. ‘కేజీఎఫ్‌-2’లో ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఈ రోజు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోను బట్టి ప్రకాశ్‌ రాజ్‌ పాత్రపై ఓ స్పష్టత వచ్చినట్లయింది.

తొలి ‘కేజీఎఫ్‌’లో సీనియర్‌ జర్నలిస్టు ఆనంద్‌ వాసిరాజు ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో కేజీఎఫ్ ప్రాంతంలో ఏం జరిగిందో వివరిస్తుండగా.. సినిమా కథ ముందుకు సాగుతుంటుంది. సీనియర్‌ నటుడు అనంత్‌ నాగ్ పోషించిన ఆ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అయితే అనుకోని కారణాల వల్ల ఆయన ‘కేజీఎఫ్‌ 2’ నుంచి తప్పుకొన్నారు. మరి ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారో అంటూ వస్తున్న ప్రశ్నలకు తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ఫొటో సమాధానమిచ్చింది. ప్రకాశ్‌ రాజ్‌ షేర్‌ చేసిన మరో ఫొటోలో అయితే ఇంటర్వ్యూ సెటప్‌ అంతా కనిపిస్తోంది. ఒకవేళ ప్రకాశ్‌ ఆ పాత్రలో కనిపిస్తే... పాన్‌ ఇండియా సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి, ఆ పాత్రకు మరింత బలం చేకూరనుంది.

ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఈ సినిమాలో కీలకమైన ‘అధీర’ పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఆ పాత్రకు సంబంధించిన లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయిక. ప్రధానిగా రవీనా టాండన్‌ నటిస్తుండగా, ఓ కీలక పాత్రలో తెలుగు నటుడు రావు రమేశ్‌ నటిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని