Pranitha: ధైర్యం అందించాల్సిన సమయమిది - pranitha about positivity
close
Published : 07/05/2021 20:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pranitha: ధైర్యం అందించాల్సిన సమయమిది

ఇంటర్నెట్‌ డెస్క్: ‘మనమంతా సాయం చేయడానికి సమయమిదే. మనవంతు కృషి చేద్దాం కొవిడ్‌ బాధితుల్ని కాపాడుదాం’ అని యువ నటి ప్రణీత సుభాష్‌ కోరారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో ఎంతోమందికి ఆహారాన్ని అందించి తనలోని సేవాగుణాన్ని చాటుకొంది ప్రణీత. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ పరిస్థితుల్ని చూసి చలించిన ఆమె మరోసారి ఉదారత చాటుకుంది. ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం ప్రణీత ఫౌండేషన్‌ తరఫున రూ.లక్ష విరాళం సేకరించింది. ఈ సందరర్భంగా మాట్లాడుతూ.. ‘కొవిడ్‌ ఫస్ట్‌ వేవ్‌ సమయంలో నేనూ నా బృందం కలిసి వీధుల్లో తిరిగి కార్మికులకి, పేదలకు భోజనం అందించాం. కానీ, సెకండ్‌ వేవ్‌ని చూస్తుంటే భయంగా ఉంది. నా కారణంగా కుటుంబ సభ్యులకి రిస్క్‌ ఉండకూడదని భావిస్తున్నా. అందుకే ఇప్పుడు బయటకు రావడంలేదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నా ప్రమేయం లేకుండానే ఏదో ఒకటి చేయాలనుకున్నా. ప్రస్తుతం ఆక్సిజన్‌ సిలిండర్ల అవసరం ఎంతగానో ఉంది. కొవిడ్‌తో పోరాడుతున్న వారిని రక్షించేందుకు వీటిని అందించాలని నా వంతు కృషి చేశాను’ అని తెలిపారు.

వాటికి సమయం ఇది కాదు..

‘నటులుగా మనమంతా సోషల్‌ మీడియాలో ఏం పోస్ట్‌ చేస్తున్నామో ఓ సారి ఆలోచించాలి. విలాసవంతంగా గడిపిన క్షణాల్ని, ఫ్యాషన్‌కి సంబంధించిన ఫొటోల్ని పంచుకునేందుకు ఇది సమయం కాదు. అవును.. సామాజిక మాధ్యమాల వేదికగా సానుకూల దృక్పధాన్ని పెంచాల్సిన సమయమిది’ అని సహ నటులని ఉద్దేశించి అన్నారు ప్రణీత.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని