TS NEWS: హైదరాబాద్‌ చేరుకున్న ప్రశాంత్‌ - prasanth reached at hyderabad
close
Updated : 01/06/2021 17:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS NEWS: హైదరాబాద్‌ చేరుకున్న ప్రశాంత్‌

హైదరాబాద్‌: పాకిస్థాన్‌లో చిక్కుకున్న తెలుగు యువకుడు ప్రశాంత్‌ ఎట్టకేలకు హైదరాబాద్‌ చేరుకున్నారు. మాదాపూర్‌ పోలీసులు ప్రశాంత్‌ను దిల్లీ నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చారు. సీపీ సజ్జనార్‌.. ప్రశాంత్‌ను అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ మీడియాతో మాట్లాడుతూ... ప్రశాంత్‌ విడుదలకు సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, విదేశాంగ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

 నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్న ప్రశాంత్‌.. 2017లో తన ప్రియురాలిని కలిసేందుకు వెళ్తున్న క్రమంలో పాక్‌ అధికారులకు చిక్కాడు. ఎలాంటి వీసా, పాస్‌పోర్ట్‌ లేకుండా పాక్‌ భూభాగంలో అడుగుపెట్టడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్‌ పాక్‌ అధికారులకు చిక్కడంతో అతడి తండ్రి బాబూరావు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిశారు. తన కుమారుడిని విడిపించేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ సహకారంతో ప్రశాంత్‌ను తిరిగి స్వదేశానికి రప్పించారు. ప్రశాంత్‌ను అప్పగించడంతో అతడి కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

తిరిగివస్తానని అనుకోలేదు: ప్రశాంత్‌ 
సీపీ సజ్జనార్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్‌ భావోద్వేగానికి గురయ్యాడు. పాక్‌ నుంచి భారత్‌కు తిరిగి వస్తానని అనుకోలేదని తన అనుభవాలను వివరించాడు. ‘‘హైదరాబాద్‌ పోలీసులకు ధన్యవాదాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రుణపడి ఉంటా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లే మళ్లీ తల్లిదండ్రులను చూడగలిగా. నా సమస్యను భారత్‌-పాక్‌ మధ్య సమస్యగా  చూడకూడదు. పాకిస్థానీయులు అంత చెడ్డవారేమీ కారు. రెండు దేశాల్లోనూ మంచివారు, చెడ్డవారు ఉన్నారు. జైలులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ పుస్తకాలు చదువుకున్నా. నాలుగేళ్లలో హిందీ మాట్లాడటం నేర్చుకున్నా. జైలులో భారతీయులతో పని చేయించరు. జైలులో భారతీయుల కోసం ప్రత్యేక గదులు ఉండేవి. నేను వెళ్లే ముందు మా అమ్మ ఆపేందుకు ప్రయత్నించింది. తల్లిదండ్రుల మాటలు వినకపోతే జీవితంలో కష్టాలు వస్తాయి. అమ్మ మాట విననందుకు నాలుగేళ్లు కుటుంబానికి దూరమయ్యా’’ అంటూ ప్రశాంత్‌ తన అవేదన వ్యక్తం చేశారు. 

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని