ఇన్నాళ్లూ ఏం కోల్పోయానో తెలిసింది - prasanth varma in zombie reddy press meet
close
Updated : 06/02/2021 18:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇన్నాళ్లూ ఏం కోల్పోయానో తెలిసింది

హైదరాబాద్‌: ఇన్నాళ్ల నుంచి కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూ వస్తున్నా.. కానీ, ప్రేక్షకుల నుంచి ఇలాంటి స్పందన రావడం ఇదే తొలిసారి అని అన్నాడు డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మ. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘జాంబిరెడ్డి’. ఫిబ్రవరి 5న విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజశేఖర్‌వర్మ నిర్మాత. ఈ సినిమాకు థియేటర్లలో మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా మీడియాతో ముచ్చటించింది.

డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మ మాట్లాడుతూ.. ‘నేను కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు ఎక్కువ ఇష్టపడతా. ఈ సినిమాను థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య చూసిన తర్వాత ఇన్నాళ్లూ నేను ఏం కోల్పోయానో తెలిసింది. సినిమా చూస్తున్న ప్రేక్షకులు విపరీతంగా నవ్వడం, చప్పట్లు కొట్టడం, సినిమాను ఆస్వాదించడం.. ఇవన్నీ స్వయంగా చూడటం ఇదే మొదటిసారి. ‘జాంబిరెడ్డి’ నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. మాస్‌ ప్రేక్షకులకు బాగా నచ్చిందీ చిత్రం. ఇన్నాళ్లూ విమర్శకులను మెప్పిస్తూ వచ్చాను. ఈ సినిమా విమర్శకులతో పాటు ప్రేక్షకులకు కూడా నచ్చింది. సినిమాలో చేసిన ఆర్టిస్టులంతా ఎంతో కష్టపడ్డారు. టెక్నీషియన్లు కూడా బాగా పనిచేశారు. మేకప్‌టీమ్‌ గురించి ఎక్కువగా మాట్లాడాలి. హాలీవుడ్‌ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా జాంబీలను తయారు చేశారు. ఒకవేళ బాలీవుడ్‌లో జాంబీలపై సినిమా తీస్తే వీళ్లనే పిలుస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమాకు మొదటి నుంచి ఎంతో కష్టపడ్డాం. అందరి కష్టానికి ప్రతిఫలం ఈ విజయం’ అని అన్నారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.

ఇదీ చదవండి..

రాజగోపాల్‌ ఎవరో నాకు తెలీదు: నరేశ్‌‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని