చెప్పుల్లేకుండానే నడుస్తూ వెళ్లాను: ప్రీతినిగమ్‌ - preethi nigam and shruthi in alitho saradaga
close
Published : 20/06/2021 17:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చెప్పుల్లేకుండానే నడుస్తూ వెళ్లాను: ప్రీతినిగమ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెరపై నెగెటివ్‌ పాత్రలతో పాటు పాటు వెండితెర మీద తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు ప్రీతినిగమ్‌, శ్రుతి. ఈ ఇద్దరూ ప్రముఖ నటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు వాళ్లు సరదాగా సమాధానాలిచ్చారు. శ్రుతి మాట్లాడుతూ.. ‘అందరూ నాకు అభిమానులైతే నేను మాత్రం శ్రుతికి అభిమాని’ అని బ్రహ్మానందం ఒకసారి అన్నారని గుర్తు చేసుకుంది. ఇంట్లో తన భర్తతో ఏదైనా గొడవ జరిగితే వెంటనే ఆయన వెళ్లి వంటపాత్రలు కడిగేసి, ఇల్లు మొత్తం శుభ్రం చేస్తారని, తాను మాత్రం మొబైల్‌ ఫోన్‌ చూస్తూ ఉంటానని నటి శ్రుతి చెప్పుకొచ్చింది. మీరు తెరమీద మాత్రమే కాదు.. తెర వెనుక కూడా నెగెటివ్‌ షేడ్స్‌ చూపిస్తారట అని ఆలీ అడిగిన ప్రశ్నకు ప్రీతినిగమ్‌ స్పందిస్తూ  ‘ఆ విషయం మా ఆయనే చెప్పాలేమో’ అంటూ సరదాగా బదులిచ్చింది. ఒకానొక సందర్భంలో తాను చెప్పుల్లేకుండానే రోడ్డుమీద పరుగెత్తాల్సి వచ్చిందని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తామిద్దరం 30ఏళ్ల క్రితం నారాయణగూడలో ఒకరికొకరం పరిచయమయ్యామని, అలా తమ మధ్య స్నేహం చిగురించిందని గుర్తు చేసుకున్నారు. ఈ ఇద్దరూ మధ్యమధ్యలో రస్కీ వాయిస్‌తో డైలాగ్స్‌ చెప్పి నవ్వులు పూయించారు. ఈ పూర్తి కార్యక్రమం జూన్‌ 21 ఈటీవీలో ప్రసారం కానుంది. అప్పటి వరకూ ఈ ప్రోమో చూసి ఆనందించండి మరి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని