అవునన్నా కాదన్నా ఇది ప్రేమ! - prema idhi prema song from sashi
close
Published : 14/03/2021 16:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవునన్నా కాదన్నా ఇది ప్రేమ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆది, సురభి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘శశి’. శ్రీనివాస్‌ నాయుడు నడికట్ల దర్శకుడు. ఈ సినిమాలోని ‘ప్రేమ ఇది ప్రేమ’ అనే గీతాన్ని (లిరికల్‌ వీడియో) యువ కథానాయకుడు నాని తాజాగా విడుదల చేశారు. ఇష్క్‌ వాలి, బోల్ట్‌ ఆలపించిన ఈ మెలోడీ అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. నాయకానాయికల హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. కల్యాణ్‌ చక్రవర్తి సాహిత్యం అందించగా అరుణ్‌ చిలువేరు స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఆర్పీ వర్మ, చావలి రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించారు. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాట, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని