వైరస్‌ వ్యాప్తి ఇప్పట్లో ఆగదు: WHO - premature realistic to think covid pandemic will be stopped by end of 2021 says who
close
Updated : 02/03/2021 13:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైరస్‌ వ్యాప్తి ఇప్పట్లో ఆగదు: WHO

ఇంటర్నెట్ డెస్క్‌: కరోనా వ్యాప్తి ఈ ఏడాది చివరికల్లా ఆగిపోతుందన్న ఆలోచన పూర్తి తొందరపాటు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. అలాంటి ప్రచారాలు పూర్తి అవాస్తవమని పేర్కొంది. సమర్థవంతమైన కరోనా టీకాల వల్ల మరణాలు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్‌ డాక్టర్‌ మైకేల్‌ ర్యాన్‌ తెలిపారు. వైరస్‌ కట్టడికి టీకాలు తోడ్పడుతున్నాయని పేర్కొన్న ఆయన కొవిడ్‌ వ్యాప్తిని నియంత్రిస్తామని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉందన్న డబ్ల్యూహెచ్ఓ.. మార్పులు చెందుతున్న వైరస్‌ ప్రమాదకారిగా మారే అవకాశముందని హెచ్చరించింది. మహమ్మారి నిర్మూలనకు అన్ని దేశాలు సమష్టిగా పనిచేయాలని కోరింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని