ఇమ్యూనిటీని పెంచే పుదీనా షర్బత్.. చిటికెలో రడీ! - preparation of immunity boosting nimbu pudina sherbet recipe in telugu
close
Updated : 10/06/2021 20:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇమ్యూనిటీని పెంచే పుదీనా షర్బత్.. చిటికెలో రడీ!

కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి శరీరంలోకి చేరిన తర్వాత కొంతమందికి ప్రాణాంతకంగా కూడా మారుతోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో దీని బారిన పడకూడదన్నా, ఒకవేళ వైరస్‌ సోకినా త్వరగా కోలుకోవాలన్నా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎంతో అవసరం. ఈ క్రమంలో చాలామంది ఇమ్యూనిటీని పెంచుకోవడానికి వివిధ రకాల పదార్థాల్ని, పానీయాల్ని తీసుకుంటున్నారు. నిమ్మ పుదీనా షర్బత్‌ కూడా ఇదే కోవకు చెందుతుందంటున్నారు నిపుణులు. మరి, వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ షర్బత్‌ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి..
కావాల్సిన పదార్థాలు:
పుదీనా ఆకులు - ఒక కప్పు
నిమ్మకాయ – ఒకటి (రసం తీసి పక్కన పెట్టుకోవాలి)
తేనె - మూడు టేబుల్‌ స్పూన్లు (తేనె లేకపోతే పంచదార కూడా వేసుకోవచ్చు.. అది కూడా మితంగానే!)
వేయించిన జీలకర్ర పొడి - 1/2 టేబుల్‌ స్పూన్‌
తయారీ:
మిక్సీ జార్‌లో పైన పేర్కొన్న పదార్థాలన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే దీనికి నీటిని చేర్చుతూ పలుచటి మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గాజు గ్లాసుల్లోకి తీసుకొని ఐస్‌ ముక్కల్ని చేర్చుకుంటే సరి! ఇలా చిటికెలో చల్లటి నిమ్మ పుదీనా షర్బత్‌ రడీ అవుతుంది.
ఆరోగ్య ప్రయోజనాలు:
* ఈ షర్బత్‌లో మనం వాడిన నిమ్మ, పుదీనా ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌, బ్యాక్టీరియాలతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
* ఇక తేనె రుచికే కాదు.. ఆరోగ్యాన్ని అందించడంలోనూ మిన్నే! ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు బీపీని అదుపు చేయడానికి, గుండె ఆరోగ్యానికి ఎంతో అవసరం.
* శరీరంలో అవనసర కొవ్వుల్ని తగ్గించి బరువును అదుపులో ఉంచడంలో జీలకర్ర ప్రధాన పాత్ర పోషిస్తుంది.
* శరీరానికి తేమను అందించే గుణాలు ఈ షర్బత్‌లో విరివిగా ఉంటాయి. తద్వారా ఈ మండుటెండల్లో శరీరం డీహైడ్రేషన్‌కి గురి కాకుండా కాపాడుకోవచ్చు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని