30న రాష్ట్రపతికి బైపాస్‌ సర్జరీ! - president kovind to undergo bypass procedure on tuesday health stable
close
Published : 28/03/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

30న రాష్ట్రపతికి బైపాస్‌ సర్జరీ!

దిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆరోగ్యంపై రాష్ట్రపతి భవన్‌ ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఎయిమ్స్‌లో చేరినట్టు వెల్లడించింది. ఈ నెల 30న (మంగళవారం) ఉదయం కోవింద్‌కు బైపాస్‌ సర్జరీ జరిగే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం వైద్యులు.. బైపాస్‌ సర్జరీ చేయించుకోవాలని సూచించారని తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వెల్లడించింది. ఛాతీలో అసౌకర్యం కారణంగా రాష్ట్రపతి కోవింద్‌ నిన్న దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌‌ రెఫరల్‌ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని