నేడు టీకా తీసుకోనున్న రాష్ట్రపతి - president ram nath kovind to get 1st dose of covid-19 vaccine tomorrow
close
Updated : 03/03/2021 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేడు టీకా తీసుకోనున్న రాష్ట్రపతి

దిల్లీ: రెండో దశ వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం వ్యాక్సిన్‌ తొలిడోసును తీసుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం ఆర్మీ ఆస్పత్రిలో ఆయన తొలి డోసు తీసుకోనున్నట్లు  తెలిపారు. ఈ రెండో దశ వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా ఇప్పటికే ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మంత్రులు, ప్రముఖులు టీకాలు తీసుకున్నారు.

రెండో దశ వ్యాక్సిన్‌ పంపిణీలో మొదటి రోజు మొదటి టీకాను ప్రధాని మోదీ దిల్లీలోని ఎయిమ్స్‌లో తీసుకోగా, రెండో రోజు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆర్మీ ఆస్పత్రిలో తీసుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని భారత్‌ నిర్వహిస్తుండటం గర్వకారణమని రాష్ట్రపతి గతంలో అన్నారు. జనవరి 16న భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీని ప్రారంభించారు. ఇప్పటి వరకు 1.48 కోట్ల మంది వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. రెండో దశ వ్యాక్సిన్‌ పంపిణీలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు 2,08,791 మంది వ్యాక్సిన్‌ను తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని