మహేశ్‌ దగ్గర ఏదో టైమ్‌ మెషీన్‌ ఉంది!  - prince birthday special... tollywood heroines about mahesh babu
close
Published : 10/08/2020 02:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ దగ్గర ఏదో టైమ్‌ మెషీన్‌ ఉంది! 

సూపర్‌స్టార్‌ గురించి హీరోయిన్లు ఏమంటున్నారంటే...

మహేశ్‌బాబు అంటే నచ్చనివారుండరు. అంతలా మైండ్‌లోకి ఎక్కేస్తాడు మరి. అందంతో అబ్బురపరుస్తాడు.. మాటలతో మైమరిపిస్తాడు.. ముచ్చట్లతో టైమ్‌ ఎలా అయిపోయిందే తెలియకుండా చేస్తాడు.. తన నటనతో తండ్రిని మరిపిస్తాడు.. కచ్చితత్వంతో వావ్‌ అనిపిస్తాడు. ఈ మాటలు ప్రేక్షకులు, అభిమానులే కాదు.. ఆయనతో పని చేసిన, ఆయన అంటే ఇష్టపడిన కథానాయికలు కూడా చెబుతారు. అలాంటి మహేశ్‌ జన్మదినం ఈ రోజు. ఈ సందర్భంగా మహేశ్‌తో పనిచేసిన నాయికలు వివిధ సందర్భాల్లో ఏమన్నారో మీరే చదివేయండి.

‘‘మహేష్‌ ఎప్పుడూ ఏదో కొత్త విషయం గురించి మాట్లాడుతూ, ఆలోచిస్తూ ఉంటారు. ఫిట్‌నెస్‌ గురించి ఆయన దగ్గర విలువైన సమాచారం ఉంటుంది. డీటాక్స్‌, స్పా, ఫిట్‌నెస్‌ల గురించి ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో వస్తున్న మార్పులను ఫాలో అవుతుంటారు. అందం, ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఎప్పుడు ఏం తినాలో ఆయనకు బాగా తెలుసు. సినిమా షూటింగ్‌ గ్యాప్‌లో ఆయన నుంచి ఇవన్నీ అడిగి రాసుకునేదాన్ని’’

- రకుల్‌ప్రీత్‌ సింగ్‌

 

‘‘నా అభిమాన నటుల్లో మహేశ్‌బాబు ఒకరు. ఆయన సహనటులకు చాలా గౌరవమిస్తారు. ఓ సూపర్‌స్టార్‌ సహనటికి అలా గౌరవం ఇవ్వడం అద్భుతమనే చెప్పాలి. చాలా మంది నటులు ఇలా చేయరు. మహేశ్‌ చెన్నైలో ఉన్నప్పుడు కామన్‌ ఫ్రెండ్స్‌ వల్ల నాకు పరిచయం. ఎప్పుడైనా కలిసినప్పుడు హాయ్‌, బాయ్‌ అనుకునేవాళ్లం. ‘అతడు’, ‘సైనికుడు’ షూటింగ్స్‌లో రాత్రి 8 తర్వాత నేను నీరసించిపోయినా.. మహేశ్‌ మాత్రం రాత్రి 10.30 వరకు అదే ఉత్సాహంతో ఉండేవాడు. ఉదయం నుంచి షూటింగ్‌ చేసినా ఆయనలో ఉత్సాహం అసలు తగ్గేది కాదు. ఆయన సీన్‌ అయిపోయాక క్యారవ్యాన్‌లోకి వెళ్లకుండా సెట్‌లోనే ఉంటారు. ఇతర నటీనటుల సన్నివేశాలను మానిటర్‌లో చూస్తారు’’

- త్రిష

 

‘‘ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా నేను సినిమాల్లో రాణించానంటే దానికి మహేశ్‌ ఇచ్చిన సలహానే కారణం. ‘ప్రతి సినిమాను తొలి సినిమాలా భావించు’ అని మహేశ్‌ చెప్పిన మాటను మనసులో పెట్టుకుని సినిమాలు చేస్తూ వచ్చాను. ఆయన కూడా సినిమాలు విషయంలో ఇదే సూత్రం ఫాలో అవుతుంటారు. ప్రతి షాట్‌ను ఎంతో జాగ్రత్తగా, కచ్చితత్వంతో చేస్తారు’’

- సమంత

 

‘‘నేను మహేశ్‌ చేసిన ప్రతి సినిమాలోని లుక్స్‌ చూశాను. చాలా అద్భుతంగా అనిపించారు. ఆయన ల్యాండ్‌ మార్క్‌ 25వ సినిమాలో నేను భాగమైనందుకు చాలా ఆనందంగా అనిపించింది. ఆయనతో కలసి మరోసారి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను’’

- పూజా హెగ్డే

 

‘‘మహేశ్‌ వయసు ఎప్పుడూ తగ్గుతున్నట్లు అనిపిస్తుంటుంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ వయసు తగ్గేలా మహేశ్‌ దగ్గర ఏమైనా టైమ్‌ మెషీన్‌ ఉందేమో అనిపిస్తుంటుంది. సినిమాల విషయానికొస్తే... పర్‌ఫెక్షన్‌ కోసం చాలా కష్టపడతారు. ఎన్ని టేక్‌లు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అంతేకాదు మహేశ్‌ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌. న్యూట్రిషిన్‌, వర్కవుట్స్‌ గురించి ఎప్పుడూ మాట్లాడుతుంటారు’’

- కాజల్‌ అగర్వాల్‌

 

‘‘మహేశ్‌లో ఎక్కడా సూపర్‌స్టార్‌ అనే భావన కనిపించదు. సెట్స్‌లో ఎప్పుడూ సరదాగా ఉంటారు. అందరితో కలిసిపోతారు. సెట్‌కి వచ్చీ రాగానే ‘గుడ్‌ మార్నింగ్‌’ అంటూ పలకరిస్తారు. నేను ఈ రంగంలోకి వచ్చిన కొత్తల్లోనే మహేశ్‌తో కలసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. నేను టాలీవుడ్‌లో ఇలా ఉన్నాను అంటే... దానికి మహేశే కారణం. ఆయనతో మరోసారి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను’’

- కియారా అడ్వాణీ

 

‘‘మహేశ్‌తో పని చేయడం అద్భుతమైన అనుభవం. ఆయన ఉంటే ఆటోమేటిక్‌గా పాజిటివిటీ వచ్చేస్తుంది. సూపర్‌స్టార్‌ అనే ఫీలింగ్‌ లేకుండా సెట్‌లో అందరిలో ఒకరిగా ఉంటారు. ఆయన వ్యవహారశైలి చాలా బాగుంటుంది. పనిపట్ల ఫోకస్డ్‌గా ఉంటారు. ఎప్పుడూ సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటారు. తెలుగు ఇండస్ట్రీలో ₹500 కోట్లు వసూలు చేయగల సత్తా ఆయనది’’

- శ్రుతి హాసన్‌

 

‘‘నాకు తెలిసి పరిశ్రమలో మహేష్‌బాబు పర్‌ఫెక్ట్‌ సూపర్‌స్టార్‌. నట జీవితమే కాదు.. నిజజీవితంలో పర్‌ఫెక్షనిస్ట్‌. షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఏదైనా సీన్‌లో కనురెప్ప వాలినా, ఎవరైనా కాస్త అటుఇటుగా చేసినా.. మరో టేక్‌కి సిద్ధమైపోతారాయన. సీన్‌ పర్‌ఫెక్ట్‌గా వచ్చేంతవరకు విడిచిపెట్టరు. చిన్న చిన్న విషయాలను కూడా ఆయన అంత కచ్చితంగా తీసుకుంటారు కాబట్టే సూపర్‌స్టార్‌ అయ్యారు’’

- ప్రణీత

 

‘‘ఓ నటుడిగా మహేశ్‌ బాబు అంటే చాలా ఇష్టం. ఆయన బాలీవుడ్‌ మెటీరియల్‌ అని నా అభిప్రాయం. ఇప్పుడు బాలీవుడ్‌కి వెళ్లినా ఆయనకు ఆదరణ దక్కుతుంది. షూటింగ్‌లో స్పాంటేనియస్‌గా రియాక్ట్‌ అయ్యి... ప్రతి సన్నివేశం పండేలా చూసుకుంటారు. అందం ఆయనకు బోనస్‌ అనుకోండి’’

- కృతి సనన్‌

 

‘‘తెలుగు పరిశ్రమకు వచ్చే ముందు నాకు తెలిసిన ఏకైక తెలుగు హీరో పేరు మహేశ్‌ బాబు. లుక్స్‌, యాక్టింగ్‌, క్యారెక్టర్‌.. ఇలా ఎందులో చూసినా మహేశ్‌ అద్భుతమని చెప్పాలి. అందుకే మహేశ్‌బాబు అంటే నాకు అంత ఇష్టం’’

- రెజీనా

 

‘‘మహేశ్‌బాబును వెండితెర మీద చూసి అభిమానులు ఎంతగా ఆనందిస్తారో నేనూ అంతే సంతోషపడతాను. తెర మీద మహేశ్‌ను చూసి ఆరాధించే వాళ్లలో నేనూ ఒకరిని. ఈ ఇండస్ట్రీకి వచ్చేముందుకు నాకు టాలీవుడ్‌లో తెలిసిన తొలి పేరు మహేశే’’

- ఇలియానా

 

‘‘మహేశ్‌బాబు చాలా జాలీ టైప్‌. సెట్స్‌లో ఆయనుంటే అందరూ నవ్వుతూనే ఉంటారు. ఆయన స్వీట్‌ వాయిస్‌, పెక్యూలర్‌ నవ్వు.. సెట్స్‌లో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన అందమైన నవ్వు చూస్తే చాలా ఆనందమేస్తుంటుంది’’

- అంజలి

 

‘‘మహేశ్‌బాబుతో పని చేయడం ఎప్పుడూ ఆనందమే. తెలుగు పరిశ్రమలో ఆయనే సూపర్‌స్టార్‌. నేను కలసి పని చేసిన నటుల్లో అద్భుతమైన నటుడాయన. తెరపై మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదురుతుంది. ‘దూకుడు’ టైమ్‌లో ఆయన సెట్‌లో ఉంటే సందడే సందడి’’

- పార్వతి మెల్టన్‌

 

‘‘మహేశ్‌తో పని చేయడం చాలా మంచి అనుభవం. మామూలుగా అయితే కామ్‌గా కనిపిస్తాడు కానీ.. మాటలు మొదలుపెడితే సెన్సాఫ్‌ హ్యూమర్‌ చాలా ఎక్కువ. ‘ఒక్కడు’ చిత్రీకరణ సమయంలో చాలా ఎంజాయ్‌ చేశాం’’

- భూమిక

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని