‘టైగర్ 3’కి సంగీత దర్శకుడిగా ప్రీతమ్‌! - pritam comes on board salman khan tiger 3
close
Published : 23/03/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘టైగర్ 3’కి సంగీత దర్శకుడిగా ప్రీతమ్‌!

ఇంటర్నెట్‌ డెస్క్: కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ - కత్రీనా కైఫ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ 3’. గతంలో వచ్చిన ‘టైగర్‌’ చిత్రాలకు ఈ చిత్రం సీక్వెల్‌గా రూపొందుతోంది. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్ సంస్థ నిర్మాణంలో వస్తోన్న చిత్రానికి సంగీత దర్శకుడిగా ప్రీతమ్‌ను తీసుకున్నారు. గతంలో ప్రీతమ్‌ సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘బజరంగీ భాయిజాన్‌’, ‘రెడీ’ వంటి సినిమాలకు సంగీత స్వరాలు సమకూర్చారు. ‘టైగర్‌ 3’ పాటలను భారీ స్థాయిలో చిత్రీకరించాలని నిర్మాణ సంస్థ యోచిస్తోందని సమాచారం. ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారట. చిత్రంలో ప్రతినాయకుడిగా ఇమ్రాన్‌ హష్మీ నటించనున్నారు. ముంబయిలో ఈనెల 8న సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో నెలరోజుల పాటు ముంబైలో షూటింగ్‌ పూర్తి చేసుకుని తర్వాత జూన్‌లో యూరప్‌ షూటింగ్‌కి వెళ్లనున్నారు. ‘టైగర్ 3’ని 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తొలుత ‘టైగర్‌’ చిత్రానికి కబీర్ ఖాన్, ‘టైగర్‌ 2’కి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సల్మాన్‌ ఖాన్‌ - అమీర్‌ ఖాన్‌  ‘లాల్‌ సింగ్‌ చద్దా’, షారుఖ్‌ల ‘పఠాన్‌’ చిత్రాల్లో  అతిధిగా కనిపించనున్నారు. ఇక కత్రీనా కైఫ్‌ - గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫోన్‌ బూత్‌’ చిత్రంలో నటిస్తోంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని