రహానె కన్నా పృథ్వీషాకే ఎక్కువ మద్దతు - prithvi shaw need more chances says nehra
close
Updated : 08/05/2021 15:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రహానె కన్నా పృథ్వీషాకే ఎక్కువ మద్దతు

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో పృథ్వీషాకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సిందని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఆశీష్‌ నెహ్రా అన్నాడు. కొన్నిసార్లు సాంకేతిక ఇబ్బందులు, పరిస్థితులకు అలవాటు పడకపోవడంతో ఆటగాళ్లు ఫామ్‌ కోల్పుతుంటారని పేర్కొన్నాడు. టీ20ల్లో రహానె కన్నా ఎక్కువ పరుగులు చేసే వారికే జట్టులో చోటివ్వాలన్నాడు.

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్లో పృథ్వీషా దిల్లీ క్యాపిటల్స్‌కు అద్భుత ఆరంభాలు ఇచ్చాడు. మ్యాచు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 8 మ్యాచుల్లో 38.50 సగటు, 166 స్ట్రైక్‌రేట్‌తో 308 పరుగులు చేశాడు. 3 అర్ధశతకాలు బాదేశాడు. సీనియర్‌ ఆటగాడు శిఖర్ ధావన్‌తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అంతకుముందు విజయ్‌ హజారేలో శతకాల జోరు కొనసాగించాడు.

విజయ్ హజరే టోర్నీకి ముందు పృథ్వీషా ఫామ్‌ కోల్పోయాడు. ఆస్ట్రేలియా పర్యటనలో పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. అతడి బ్యాటింగ్‌లో సాంకేతిక లోపమే ఇందుకు కారణం. బంతి ఇన్‌స్వింగ్‌ అయి లోపలికి దూసుకు వస్తున్నప్పుడు అతడి బ్యాటు, ప్యాడ్ల మధ్య ఎక్కువ దూరం ఉంటోంది. దీనివల్ల బంతి ఆ మధ్యలోంచి వెళ్లి వికెట్లను గిరాటేసేది. ప్రస్తుతం దానిని సరిదిద్దుకొని మెరుగయ్యాడు.

తన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి పృథ్వీషా ఎంతో కష్టపడ్డాడని నెహ్రా అన్నాడు. ‘టెక్నిక్‌ పరంగా చెబితే ఏ ఆటగాడికైనా సర్దుకుపోవడం కొద్దిగా కష్టమే. అడిలైడ్‌ టెస్టు ఆడుతున్నప్పుడు అతడికి 30-40 టెస్టుల అనుభవమేమీ లేదు. మనం మాట్లాడుతున్నది ఒక యువకుడి గురించి. కేవలం ఆ మ్యాచ్‌ ఆధారంగా పక్కన పెట్టడం సరికాదు. గతేడాది ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లు ఆడిన తర్వాత తుది జట్టులోంచి తప్పించాల్సి కాదు. ఏదేమైనా రహానె కన్నా ఎక్కువ పరుగులు చేసే యువకుడికే నేను మద్దతిస్తాను. అజింక్య మంచి ఆటగాడు కాదని నేను అనడం లేదు. టీ20ల్లో షా, పంత్‌, స్టాయినిస్‌ వంటి విధ్వంసకర ఆటగాళ్లు అవసరం’ అని నెహ్రా పేర్కొన్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని