సచిన్‌తో మాట్లాడాక ఆటతీరులో మార్పొచ్చింది - prithvi shaw opens up about his position after australia tour
close
Published : 13/03/2021 08:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సచిన్‌తో మాట్లాడాక ఆటతీరులో మార్పొచ్చింది

దిల్లీ: దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ సలహా తర్వాత తన ఆటతీరులో మార్పొచ్చిందని ముంబయి కెప్టెన్‌ పృథ్వీ షా అన్నాడు. నిరుడు ఐపీఎల్‌లో నిరాశపరిచిన పృథ్వీ.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ విఫలమయ్యాడు. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఆరు బంతులే ఎదుర్కోవడంతో పృథ్వీకి తర్వాతి టెస్టుల్లో అవకాశం దక్కలేదు. శుభ్‌మన్‌ గిల్‌తో అతడి స్థానాన్ని భర్తీ చేశారు. 2020లో ఘోరంగా విఫలమైన పృథ్వీ విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్‌ టోర్నీలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లాడిన పృథ్వీ 188.5 సగటుతో 754 పరుగులు సాధించాడు. ఆసీస్‌ పర్యటన అనంతరం సచిన్‌ను కలవడం తన ఆటలో మార్పునకు కారణమని పృథ్వీ తెలిపాడు. ‘‘నాకంతా గందరగోళంగా అనిపించింది. గల్లీ ప్రాంతంలో నా బ్యాటు కాస్త కిందకి వెళ్తోంది. కానీ కెరీర్‌ మొత్తం అలాగే పరుగులు రాబట్టా. నేను ఔటవుతున్న విధానమే అసలు సమస్య. దాన్ని వెంటనే సరిచేయాలి. బ్యాటును సరిగానే ఎత్తుతున్నా గాని దేహానికి కాస్త దూరంగా వెళ్తోంది. దేహానికి బ్యాటును దగ్గరగా ఉంచాలి. ఆ పని చేయలేకపోతున్నా. ఆసీస్‌ నుంచి రాగానే సచిన్‌ సర్‌ను కలిశా. బ్యాటింగ్‌ శైలిలో ఎక్కువ మార్పులు చేయొద్దన్నాడు. వీలైనంత వరకు దేహానికి దగ్గరగా ఆడమన్నాడు. బంతిని కాస్త ఆలస్యంగా ఆడుతున్నట్లు చెప్పాడు’’ అని పృథ్వీ వివరించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని