పృథ్వీషా అదరహో.. - prithvi shaw overcomes mayank agarwals three year record in vijay hazare trophy
close
Updated : 12/03/2021 06:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పృథ్వీషా అదరహో..

ఒకే టోర్నీలో మూడుసార్లు 150+ స్కోర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ పృథ్వీషా(165; 122 బంతుల్లో 17x4, 7x6) మరోసారి రెచ్చిపోయాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా ముంబయి తరఫున ఆడుతున్న అతడు గురువారం కర్ణాటకతో జరిగిన సెమీఫైనల్స్‌లో భారీ శతకం సాధించాడు. దీంతో ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా షా(754) నిలవడమే కాకుండా మూడేళ్ల క్రితం ఇదే టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన మయాంక్‌ అగర్వాల్‌(723) రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే ప్రస్తుత టోర్నీలో మూడుసార్లు 150+ స్కోర్‌ సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జైశ్వాల్‌(6) విఫలమవ్వగా వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ తారే(16) సైతం నిరాశ పరిచాడు. ఆపై షామ్స్‌ ములాని(45; 71 బంతుల్లో 4x4)తో కలసి షా ధాటిగా ఆడాడు. కర్ణాటక బౌలర్లపై చిరుత పులిలా విరుచుకుపడ్డాడు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీ బాట పట్టించాడు. ఈ క్రమంలోనే 48 బంతుల్లో అర్ధశతకం, తర్వాతి 31 బంతుల్లో శతకం, ఆపై మరో 32 బంతుల్లో 150 స్కోర్‌ సాధించాడు. అయితే ప్రమాదకరంగా మారిన ఈ జోడీని కృష్ణప్ప గౌతమ్‌ విడదీశాడు. జట్టు స్కోర్‌ 241 పరుగుల వద్ద ములానిని మూడో వికెట్‌గా పెవిలియన్‌ పంపాడు. అప్పటికి వాళ్లిద్దరూ 159 పరుగులు జోడించారు. మరో రెండు పరుగులకే షా(165)ను వైశక్‌ ఎల్బీడబ్యూ చేయడంతో ముంబయి నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఒకవేళ అతడు ఔటవ్వకపోయి ఉంటే ఈ సీజన్‌లో రెండో డబుల్‌ సెంచరీ నమోదు చేసేవాడు! చివరికి ముంబయి 49.2 ఓవర్లలో 322 పరుగులకు ఆలౌటైంది. అనంతరం కర్ణాటక 42.4 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. దేవదత్‌ పడిక్కల్‌ (64; 64 బంతుల్లో 9×4, 1×6), శరత్‌ (61; 39 బంతుల్లో 8×4, 2×6) పోరాడినా ఫలితం లేకపోయిందిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని