ఆరోజు గదిలోకెళ్లి ఏడ్చాను.. : పృథ్వీషా - prithvi shaw says he was confused post australi series
close
Published : 12/03/2021 15:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరోజు గదిలోకెళ్లి ఏడ్చాను.. : పృథ్వీషా

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఏమీ అర్థంకాని పరిస్థితికి చేరుకున్నానని టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీషా అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్‌హజారె ట్రోఫీలో అత్యధికంగా 754 పరుగులు చేసిన అతడు తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో (0, 4) విఫలమైన పృథ్వీని టీమ్‌ఇండియా తర్వాతి టెస్టులకు దూరంపెట్టిన సంగతి తెలిసిందే. ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారని ప్రశ్నించగా..

‘అప్పుడు నేను చాలా ఆందోళనకు గురయ్యా. ఏం జరుగుతోందని నన్ను నేను ప్రశ్నించుకున్నా. నా బ్యాటింగ్‌లో లోపాలుంటే.. అవేంటని ఆలోచించా. అయితే, పింక్‌బాల్‌ టెస్టులో ప్రపంచంలోనే మేటి జట్టుతో ఆడానని నాకు నేను సర్దిచెప్పుకున్నా. ఆ మ్యాచ్‌లో నేనెందుకు బౌల్డ్‌ అయ్యానని ప్రశ్నించుకున్నా. అద్దం ముందు నిల్చొని అందరూ అనుకున్నంత చెత్త ఆటగాడిని మాత్రం కాదని భావించా. ఆ సిరీస్‌లో జట్టు గెలిచినందుకు సంతోషంగా ఉన్నా నన్ను పక్కనపెట్టడంతో ఆందోళన చెందా. అదే నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు. ఆరోజు గదిలోకెళ్లి ఏడ్చేశాను. ఏదో జరుగుతుందని అనిపించింది’ అని పృథ్వీ చెప్పుకొచ్చాడు.

కాగా, ఆ పర్యటన తర్వాత విజయ్‌ హజారె ట్రోఫీలో ఆడుతున్న పృథ్వీ.. ముంబయి కెప్టెన్‌గా చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలోనే మూడు సెంచరీలతో పాటు ఒక ద్విశతకం సాధించి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దాంతో మూడేళ్ల క్రితం ఇదే టోర్నీలో కర్ణాటక బ్యాట్స్‌మన్‌గా మయాంక్‌ అగర్వాల్‌ సాధించిన 723 అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. ఇక ఈ సీజన్‌లో ముంబయి గురువారం కర్ణాటక జట్టును ఓడించడంతో ఫైనల్‌కు చేరింది. ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌తో ఫైనల్లో తలపడనుంది. పృథ్వీ మరోసారి ఇక్కడ చెలరేగితే ముంబయికి కప్పు అందించడం ఖాయం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని