ప్రియా పూనియాకు స్ఫూర్తినిచ్చిన కోహ్లీ అనుభవం! - priya punia’s father gave example of virat kohli to motivate daughter after mother’s death
close
Published : 22/05/2021 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రియా పూనియాకు స్ఫూర్తినిచ్చిన కోహ్లీ అనుభవం!

ఇంటర్నెట్ డెస్క్‌: టీమిండియా మహిళా క్రికెటర్‌ ప్రియా పూనియా తల్లి ఇటీవలే కరోనా బారినపడి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, జూన్‌లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ పర్యటనకు ప్రియా పూనియాను సెలక్టర్లు ఎంపిక చేయగా.. జూన్‌ 2న జట్టు అక్కడికి వెళ్లనుంది. కానీ, తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న పూనియాలో స్ఫూర్తి నింపేందుకు టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీని ఉదాహరణగా చూపినట్లు ఆమె తండ్రి సురేందర్‌ పేర్కొన్నారు. ‘ఇంగ్లాండ్‌ పర్యటన కోసం నా కుమార్తె (ప్రియా పూనియా)లో నేను స్ఫూర్తి నింపాలనుకున్నా. విరాట్ కోహ్లీకి ఎదురైన ఇలాంటి అనుభవం గురించి ప్రస్తావించా. కోహ్లీ తన తండ్రిని కోల్పోయినా తర్వాత రంజీ మ్యాచ్‌ ఆడటానికి వెళ్లాడని చెప్పా. మా కుటుంబానికి ఇది చాలా క్లిష్ట పరిస్థితి. కానీ మేం మానసికంగా ధైర్యంగా ఉండాల్సిన సమయమిది. జీవితంలో ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తానికి ప్రియా పరిస్థితులను అర్థం చేసుకుంది. నాన్నా.. నేను ఆడేందుకు సిద్ధమని చెప్పింది’ అని సురేందర్‌ తెలిపారు. భారత మహిళల జట్టు అతిథ్య జట్టు ఇంగ్లాండ్‌తో జూన్‌ 16న ఏకైక టెస్టు, ఆ తర్వాత మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని