అదృష్టాన్ని కాపాడుకోవడం కోసం శ్రమిస్తున్నా - priya varrier says luck favoured her as she opens up on gaining popularity
close
Published : 03/03/2021 18:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదృష్టాన్ని కాపాడుకోవడం కోసం శ్రమిస్తున్నా

నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

హైదరాబాద్‌: కేవలం కన్నుగీటడంతో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడం నిజంగానే తన అదృష్టమని నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ అన్నారు. ‘ఓరు అదార్‌ లవ్‌’తో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ కుట్టి ఇటీవల విడుదలైన ‘చెక్‌’తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఈ నేపథ్యంలో ప్రియా ప్రకాశ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

‘‘ఓరు అదార్‌ లవ్‌’లోని ఓ సన్నివేశంతో సోషల్‌మీడియా వేదికగా ఓవర్‌నైట్‌లోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడం నా అదృష్టం. ఆ అదృష్టాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు శ్రమిస్తున్నాను. ఆ సినిమా విడుదలై మూడేళ్లు అవుతున్నప్పటికీ నాపై ప్రేక్షకులు చూపించే ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. అందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం నేను కన్నడలో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నా. తెలుగు కంటే కన్నడ మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం పలు సినిమా ఆఫర్స్‌ వస్తున్నాయి. మంచి కథలను మాత్రమే ఎంచుకోవాలనుకుంటున్నా’’ అని ఆమె వివరించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని