నగ్నచిత్రం అడిగిన నెటిజన్‌.. ప్రియమణి రిప్లై - priyamani asked to post a nude pic and she give strong reply
close
Published : 01/04/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నగ్నచిత్రం అడిగిన నెటిజన్‌.. ప్రియమణి రిప్లై

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియాలో సెలబ్రిటీలకు అప్పుడప్పుడు ఇబ్బందికరమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అలాంటి పరిస్థితి కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. కొంతమంది ఆకతాయిలు అభ్యంతరమైన కామెంట్లు పెడుతూ వాళ్లను ఇబ్బంది పెడుతుంటారు. ఇటీవల ఓ నెటిజన్‌ నుంచి హీరోయిన్‌ పూజాహెగ్డే ఇలాంటి సంఘటన ఎదుర్కొంది. తాజాగా మరో నటి ప్రియమణికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే.. తన పోస్టుపై అభ్యంతరమైన కామెంట్‌ చేసిన ఆ నెటిజన్‌కు ప్రియమణి కాస్త ఘాటుగానే బదులిచ్చింది. ఇంతకీ ఏమైందంటే..

నటి ప్రియమణి ఇటీవల నలుపు రంగుల్లో దుస్తుల్లో ఒక ఫొటోషూట్‌లో పాల్గొంది. దానికి సంబంధించిన చిత్రాలు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అయితే.. ఆ పోస్టుల్లో ఒకదానిపై ఓ నెటిజన్‌ అభ్యంతరకరంగా కామెంట్‌ చేశాడు. నగ్నచిత్రం పోస్టు చేయమని ప్రియమణిని అడిగాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘మొదట మీ సోదరి లేదా తల్లిని పోస్టు చేయమని అడగు.. ఆ తర్వాత నేను పోస్టు చేస్తాను’ అంటూ ఆమె బదులిచ్చింది. దీంతో తన తప్పు తెలుసుకున్న సదరు వ్యక్తి క్షమాపణలు కోరుతూ మరో కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ’ కార్యక్రమంలో జడ్జీగా వ్యవహరించడంతో పలు సినిమాల్లోనూ నటిస్తోంది. తెలుగులో నారప్ప, విరాటపర్వం, సైనైడ్‌ చిత్రాలతో పాటు హిందీ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ ఆమె నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని