మహాసముద్రంతో మరోసారి? - priyanka arul mohan in sharwanand maha samudram
close
Published : 20/09/2020 16:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహాసముద్రంతో మరోసారి?

హైదరాబాద్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ వంటి హిట్‌ తర్వాత అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం ‘మహాసముద్రం’. శర్వానంద్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. సిద్ధార్థ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. సుంకర రామబ్రహ్మం నిర్మాత. గాఢతతో నిండిన చక్కటి ప్రేమకథతో రూపొందనున్న చిత్రమిది. యాక్షన్‌కు ప్రాధాన్యముంది. ఈ చిత్రంలో శర్వాకు జోడీగా కనిపించబోయే నాయిక కోసం సమంత, సాయిపల్లవి, అదితీరావు హైదరీ వంటి వారి పేర్లు వినిపించాయి.

ఇప్పుడీ అవకాశం ‘గ్యాంగ్‌లీడర్‌’ భామ ప్రియాంక అరుళ్‌ మోహన్‌ అందుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా చేస్తున్న ‘శ్రీకారం’ చిత్రంలోనూ ఆమే కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడీ జోడీనే మరోసారి ఈ కొత్త చిత్రంతో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె ఈ కథకు అంగీకారం    తెలిపిందని, మరికొద్ది రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని