వచ్చే ఏడాదిలో తప్పకుండా చేస్తా! - priyanka chopra about her bollywood movies
close
Published : 28/03/2021 10:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వచ్చే ఏడాదిలో తప్పకుండా చేస్తా!

ఇంటర్నెట్‌డెస్క్‌: గ్లోబల్‌ నటిగా మారినప్పటి నుంచి ప్రియాంక దృష్టంతా హాలీవుడ్‌ చిత్రాలపైనే ఉంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ప్రాజెక్ట్‌లన్నీ హాలీవుడ్‌కి సంబంధించినవే. నటిగా తనకి సవాల్‌ విసిరే కథలు దొరికితే తప్ప బాలీవుడ్‌లో కొత్త సినిమాలేవీ ఒప్పుకోవట్లేదు. 2019లో వచ్చిన ‘స్కై ఈజ్‌ పింక్‌’ తర్వాత మరో హిందీ చిత్రమేది చేయలేదు. అయితే ఆమె త్వరలో బాలీవుడ్‌లో ఓ సినిమా చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులకు తెలియజేసింది.

తాజాగా ప్రియాంక ట్విటర్‌ వేదికగా   అభిమానులతో చిట్‌చాట్‌ చేయగా.. ఓ నెటిజన్‌ ‘మీ తదుపరి బాలీవుడ్‌ చిత్రం ఎప్పుడ’ని ప్రశ్నించాడు. దానికి ఆమె ‘వచ్చే ఏడాది’ అని బదులిచ్చింది. అయితే ఆ సినిమా ఎవరితో చేయనున్నది వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె రిచర్డ్‌ మాడెన్‌తో కలిసి ‘సిటాడెల్‌’ అనే అమెజాన్‌ సిరీస్‌లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్‌ చిత్రీకరణ లండన్‌లో జరుగుతోందని, సెట్లో రిచర్డ్‌తో కలిసి గడపడం చాలా    సరదాగా ఉందని తెలియజేసింది. ఆమె ఇప్పుడీ సిరీస్‌తో పాటు ‘మ్యాట్రిక్స్‌ 4’లోనూ నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని