మళ్లీ దాని జోలికి వెళ్లే తీరిక లేదు - priyanka chopra about her singing
close
Updated : 19/02/2021 13:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మళ్లీ దాని జోలికి వెళ్లే తీరిక లేదు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రియాంక చోప్రా దృష్టంతా ఇప్పుడు హాలీవుడ్‌పైనే ఉంది. ఆమెలో మంచి నటే కాదు గాయనీ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో పలు ప్రత్యేక వీడియో గీతాల్ని విడుదల చేసింది. ‘ఇన్‌ మై సిటీ’ అనే వీడియో గీతంతో గాయనిగా మారిన ప్రియాంక ఆ తర్వాత ‘ఎక్జోటిక్‌’, ‘ఐ కాంట్‌ మేక్‌ యు లవ్‌ మి’ గీతాలతో అలరించింది. ఇప్పుడు ఎలాగూ తన భర్త నిక్‌ సంగీత ప్రపంచంలో అనుభవం ఉన్నవాడే కాబట్టి మళ్లీ గాయనిగా మారడానికి ప్రియాంక ఆసక్తి చూపిస్తుందా? అంటే లేదు అనే సమాధానమే ఆమె నుంచి వినిపిస్తోంది. ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుంది ప్రియాంక.

‘‘నిక్‌ సంగీతంలో నిష్ణాతుడు. ఇప్పుడు ఆయనతో కలిసి పాడి నా ఇమేజ్‌ పెంచుకోవాలి అనుకోవడం లేదు. సంగీతం అనే అధ్యాయాన్ని కొన్ని సంవత్సరాల క్రితమే ముగించాను. ఇప్పుడు మళ్లీ దాని జోలికి వెళ్లే తీరిక లేదు. అంతకంటే ప్రాధాన్యం ఉన్న విషయాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. ప్రస్తుతం నా దృష్టంతా నటన,     చిత్ర నిర్మాణం మీదే’’అని చెప్పింది ప్రియాంక. ఆమె ప్రస్తుతం లండన్‌లో ‘సిటాడెల్‌’ అనే వెబ్‌ సిరీస్‌ చిత్రీకరణలో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఆమె చేస్తున్న సిరీస్‌ ఇది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని