ప్రభాస్‌ కోసం రంగంలోకి దిగిన గ్లోబల్‌స్టార్‌? - priyanka chopra in salaar
close
Published : 07/02/2021 14:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ కోసం రంగంలోకి దిగిన గ్లోబల్‌స్టార్‌?

హైదరాబాద్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సలార్‌’. ప్రకటించిన రోజు నుంచే ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ సరికొత్త అప్‌డేట్‌ ప్రస్తుతం అందర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ మేరకు ‘సలార్‌’ కోసం గ్లోబల్‌స్టార్‌ ప్రియాంకా చోప్రా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌-హాలీవుడ్‌ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న ప్రియాంక.. ప్రస్తుతం ఈ రెండు ఇండస్ట్రీల్లో వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘సలార్‌’పై బాలీవుడ్‌ ప్రేక్షకుల చూపు పడేలా చేసేందుకు ప్రియాంకా చోప్రాను రంగంలోకి దించాలని సదరు చిత్రబృందం భావిస్తోందట.  ఈ మేరకు ప్రియాంక ‘సలార్‌’లో ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడనున్నారంటూ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే, సదరు వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. తొమ్మిదేళ్ల తర్వాత ఓ టాలీవుడ్‌ నటుడు సరసన ప్రియాంక నటించిన చిత్రమిదే అవుతుంది. రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘జంజీర్‌’లో ప్రియాంక నటించిన విషయం తెలిసిందే. ఇక, ‘సలార్‌’ షూట్‌ ప్రస్తుతం గోదావరిఖనిలో జరుగుతోంది. ఈ సినిమాలో నటి శ్రుతిహాసన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు.

ఇదీ చదవండి

సుకుమార్‌.. ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి..!

‘సలార్‌’ విలన్‌ ఫిక్స్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని