‌సెట్‌లో సేఫ్‌గా అనిపించలేదు: ప్రియాంకా చోప్రా - priyanka chopra on getting into acting by fluke
close
Published : 31/01/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‌సెట్‌లో సేఫ్‌గా అనిపించలేదు: ప్రియాంకా చోప్రా

లాస్‌ఏంజెల్స్‌: బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతూ గ్లోబల్‌స్టార్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి ప్రియాంకా చోప్రా. ఇటీవల విడుదలైన ‘వైట్‌ టైగర్‌’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ప్రియాంక.. తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో సరదాగా ముచ్చటించారు.

‘నా తల్లిదండ్రులిద్దరూ ఉన్నత విద్యను అభ్యసించినవారే. నేను కూడా చదువుల్లో రాణించి.. ఇంజినీర్‌గా మారాలని భావించా. కానీ అనూహ్యంగా నా అడుగులు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ వైపు పడ్డాయి. అందాలపోటీలో భాగమైన నేను 2000లో ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నాను. ఆ సమయంలోనే భారత్‌ నుంచి ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. సినిమా గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదు. ఒకరకంగా చెప్పాలంటే నటనకు సంబంధించిన చాలా విషయాలను చిత్రీకరణ సమయాల్లోనే నేర్చుకున్నాను. సినీ పరిశ్రమ నాకు చక్కగా నప్పుతుందని ఆ తర్వాత నేను అర్థం చేసుకున్నా’

లాక్‌డౌన్‌ అనంతరం సినిమా చిత్రీకరణల్లో పాల్గొనడం గురించి స్పందిస్తూ.. ‘లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా చిత్రీకరణ జరిగే లొకేషన్స్‌లో అన్ని రకాల నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ చిత్రీకరణ జరిగే లొకేషన్స్‌ను నేను సేఫ్‌గా భావించలేకపోయాను’ అని ప్రియాంక వివరించారు.

ఇదీ చదవండి

అందరూ వచ్చారు కానీ వీళ్లే ఆగిపోయారు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని