సొంత హోటల్‌లో అడుగుపెట్టిన ప్రియాంక - priyanka chopra visited her restaurant sona at newyork
close
Updated : 27/06/2021 19:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సొంత హోటల్‌లో అడుగుపెట్టిన ప్రియాంక

న్యూయార్క్‌: ప్రముఖ నటి ప్రియాంక చోప్రా న్యూయార్క్‌లో సోనా అనే రెస్టారంట్‌ నెలకొల్పిన సంగతి తెలిసిందే. తొలిసారిగా ఆదివారం అక్కడికి అడుగుపెట్టారామె. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ట్రెండీ దుస్తుల్లో కనిపించి సందడి చేశారు. పానీ పూరిని ఆస్వాదించిన, సిబ్బందితో దిగిన కొన్ని ఫొటోల్ని షేర్‌ చేశారు. ‘చివరిగా ఇలా సోనా దగ్గర ఉంటాననే విషయాన్ని నమ్మలేకపోతున్నా. మూడేళ్ల ప్రణాళిక అనంతరం ఇది పూర్తయింది. కిచెన్‌లోకి వెళ్లాలని, మా బృందాన్ని కలవాలని నా మనసు తహతహలాడేది. మిమీస్‌ పేరిట రూపొందించిన ప్రైవేటు డైనింగ్‌ రూం, ఇంటీరియర్‌, నోరూరించే ఆహారం, డ్రింక్స్‌.. అన్నీ ఎంతో బాగున్నాయి. ఇదొక మధురమైన అనుభవం’ అని తెలిపారు ప్రియాంక. 2019 సెప్టెంబరులో దీని నిర్మాణం చేపట్టారు. ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైంది.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని